కేసీఆర్‌పై రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నిరసన.

నేడు కల్లూరులో శాంతియుత కార్యక్రమం.

కేసీఆర్‌పై రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నిరసన.

సత్తుపల్లి, ఫిబ్రవరి 31 (తెలంగాణ ముచ్చట్లు):

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై జరుగుతున్న రాజకీయ వేధింపులకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా నేడు (ఆదివారం) కల్లూరులో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ మండల పార్టీ పిలుపు మేరకు ఉదయం 10 గంటలకు కల్లూరు పట్టణంలోని మెయిన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరుగనుంది.
ఈ నిరసనకు సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య నాయకత్వం వహిస్తున్నారు. పార్టీ అధినేతపై రాజకీయ కక్షసాధింపుతో చర్యలు చేపడుతున్నారని, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కల్లూరు పట్టణం, మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుల నాయకులు, తాజా మరియు మాజీ ప్రజాప్రతినిధులు, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పార్టీ పిలుపునిచ్చింది. మీడియా మిత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాలెపు రామారావు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గ్రామీణ వైద్యుల శిక్షణను తిరిగి ప్రారంభించాలి గ్రామీణ వైద్యుల శిక్షణను తిరిగి ప్రారంభించాలి
--- ప్రతి వెయ్యి మందికి ఒక గ్రామీణ వైద్యుడిని నియమించి గౌరవ వేతనం ఇవ్వాలి--- తెలంగాణ మైనారిటీ గ్రామీణ వైద్యుల సంఘం 12వ మహాసభలో  స్పర్శ సామాజిక...
స్పోర్ట్స్ మీట్ తో విద్యార్థుల్లో నూతన ఉత్తేజం పెంపొందుతుంది.
ధన్యజీవి ఏపూరి సీతయ్య
ప్రత్యేక సమగ్ర సవరణను పకడ్బందీగా నిర్వహించాలి.. 
ప్రభుత్వ ప్రాధాన్యత పనుల పూర్తిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.... 
మైనారిటీ సొసైటీల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రవేశ పరీక్ష కు దరఖాస్తుల ప్రారంభం
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా 4వ వార్డులో ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రచారం