స్పోర్ట్స్ మీట్ తో విద్యార్థుల్లో నూతన ఉత్తేజం పెంపొందుతుంది.

స్పోర్ట్స్ మీట్ తో విద్యార్థుల్లో నూతన ఉత్తేజం పెంపొందుతుంది.

---మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఐ యం ఏ చైర్మన్ ,ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కంభంపాటి నారాయణరావు .

---ముగిసిన స్మార్ట్ కిడ్జ్  స్పోర్ట్స్ మీట్. 

ఖమ్మం బ్యూరో, జనవరి 31(తెలంగాణ ముచ్చట్లు)

స్పోర్ట్స్ మీట్ లతో విద్యార్థుల్లో నూతన ఉత్తేజం పెంపొందుతుందని మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ,మాజీ ఐయంఎ ప్రెసిడెంట్ ,ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కంభంపాటి నారాయణరావు  తెలియజేశారు. స్థానిక  స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో పాఠశాల చైర్మన్ చింతనిప్పు కృష్ణ చైతన్య ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించిన స్మార్ట్ కిడ్జ్ స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకల బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో వారు  ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసాన్ని పెంచుతున్నాయి అన్నారు. విద్యార్థులు తరగతి గదులకే పరిమితం కాకుండా క్రీడా పోటీల ద్వారా విద్యార్థుల్లో మరింత చురుకుదనం , ఏకాగ్రత, పోటీ తత్వం , క్రీడా స్ఫూర్తి  పెరుగుతుందని తెలిపారు.స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో విద్యార్థులను క్రీడలతో పాటు అన్ని రంగాలలో నిత్యం ప్రోత్సహించి ఉన్నత స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దడం అభినందనీయం అన్నారు. పాఠశాల చైర్మన్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ గత రెండు రోజులుగా నిర్వహించిన స్మార్ట్ కిడ్జ్ స్పోర్ట్స్ మీట్ లో విద్యార్థులు అన్ని రకాల క్రీడా పోటీలలో తమ సత్తా చాటి రాణించారని తెలిపారు. బహుమతులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. అంతకుముందు పాఠశాలలో సీనియర్ విద్యార్థులకు కబడ్డీ, కో కో, రన్నింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో ఆధ్యంతం ఉత్కంఠభరితంగా జరిగాయి. సభానంతరం  22 రకాల ఆటల పోటీలలో  గెలుపొందిన విజేతలకు అతిధులు బహుమతి ప్రధానం చేసి విద్యార్థులను అభినందించారు. ఈ బహుమతి ప్రధానోత్సవ  కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య,ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. IMG-20260131-WA0065

Tags:

Post Your Comments

Comments

Latest News

గ్రామీణ వైద్యుల శిక్షణను తిరిగి ప్రారంభించాలి గ్రామీణ వైద్యుల శిక్షణను తిరిగి ప్రారంభించాలి
--- ప్రతి వెయ్యి మందికి ఒక గ్రామీణ వైద్యుడిని నియమించి గౌరవ వేతనం ఇవ్వాలి--- తెలంగాణ మైనారిటీ గ్రామీణ వైద్యుల సంఘం 12వ మహాసభలో  స్పర్శ సామాజిక...
స్పోర్ట్స్ మీట్ తో విద్యార్థుల్లో నూతన ఉత్తేజం పెంపొందుతుంది.
ధన్యజీవి ఏపూరి సీతయ్య
ప్రత్యేక సమగ్ర సవరణను పకడ్బందీగా నిర్వహించాలి.. 
ప్రభుత్వ ప్రాధాన్యత పనుల పూర్తిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.... 
మైనారిటీ సొసైటీల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రవేశ పరీక్ష కు దరఖాస్తుల ప్రారంభం
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా 4వ వార్డులో ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రచారం