రోడ్డు నియమాలే ప్రాణ రక్షణ.

రోడ్డు నియమాలే ప్రాణ రక్షణ.

- సత్తుపల్లిలో రోడ్డు భద్రత అవగాహన ప్రదర్శన.

- మైనర్లు వాహనాలు నడపడం చట్టవిరుద్ధం.
- మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జె.ఎన్.శ్రీనివాసరావు.

సత్తుపల్లి, జనవరి 31(తెలంగాణ ముచ్చట్లు):

రోడ్డు భద్రత అనేది కేవలం అధికారుల బాధ్యత మాత్రమే కాదని, రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్కరి బాధ్యత అని సత్తుపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జె.ఎన్. శ్రీనివాసరావు అన్నారు. రోడ్డు నియమాలు పాటిస్తే ప్రాణాలు సురక్షితంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల (జనవరి 1 నుంచి 31 వరకు) ముగింపు సందర్భంగా శనివారం సత్తుపల్లిలో రవాణా శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున రోడ్డు భద్రత అవగాహన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న వారితో రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు, విద్యాసంస్థల యాజమాన్యాలు, వారి డ్రైవర్లు, గంగారం బెటాలియన్ పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రవాణా శాఖ అధికారులు శ్రీనివాసరావు, రాజశేఖర్ రెడ్డి, సత్తుపల్లి మండల విద్యాశాఖ అధికారి రాజేశ్వరరావు మాట్లాడుతూ మైనర్లు వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని తెలిపారు. ఇటువంటి చర్యలు వారి భవిష్యత్తుతో పాటు ఇతరుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతాయని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలు అనేక కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ప్రయాణాన్ని సురక్షితంగా, సుఖవంతంగా మార్చుకోవాలని సూచించారు. వేగం కన్నా ప్రాణమే మిన్న అనే విషయాన్ని గుర్తించి వాహనాలు నడపాలని, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం ప్రాధాన్యతను వివరించారు. అవగాహన ప్రదర్శనలో రోడ్డు భద్రతపై నినాదాలు, పాటలు ప్రజలను ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో బెటాలియన్ పోలీస్ అధికారి సత్యనారాయణ, ప్రైవేటు విద్యాసంస్థల సంఘం సత్తుపల్లి డివిజన్ (ట్రస్మా) అధ్యక్షుడు పసుపులేటి నాగేశ్వరరావుతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.IMG-20260131-WA0030

Tags:

Post Your Comments

Comments

Latest News

గ్రామీణ వైద్యుల శిక్షణను తిరిగి ప్రారంభించాలి గ్రామీణ వైద్యుల శిక్షణను తిరిగి ప్రారంభించాలి
--- ప్రతి వెయ్యి మందికి ఒక గ్రామీణ వైద్యుడిని నియమించి గౌరవ వేతనం ఇవ్వాలి--- తెలంగాణ మైనారిటీ గ్రామీణ వైద్యుల సంఘం 12వ మహాసభలో  స్పర్శ సామాజిక...
స్పోర్ట్స్ మీట్ తో విద్యార్థుల్లో నూతన ఉత్తేజం పెంపొందుతుంది.
ధన్యజీవి ఏపూరి సీతయ్య
ప్రత్యేక సమగ్ర సవరణను పకడ్బందీగా నిర్వహించాలి.. 
ప్రభుత్వ ప్రాధాన్యత పనుల పూర్తిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.... 
మైనారిటీ సొసైటీల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రవేశ పరీక్ష కు దరఖాస్తుల ప్రారంభం
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా 4వ వార్డులో ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రచారం