ధన్యజీవి ఏపూరి సీతయ్య

సీపీఐ రాష్ట్రకార్యదర్శి కూనంనేని

ధన్యజీవి ఏపూరి సీతయ్య

ఖమ్మం బ్యూరో,జనవరి 31(తెలంగాణ ముచ్చట్లు)

సీపీఐ సీనియర్ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధుడు నాగిలిగొండ గ్రామానికి చెందిన ఏపూరి సీతయ్య ధన్యజీవి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. నాగిలిగొండ గ్రామానికి చెందిన ఏవూరి సీతయ్య (90) బుధవారం అనారోగ్యంతో మరణించిన విషయం విదితమే. ఆయన మరణవార్త తెలుసుకున్న కూనంనేని శుక్రవారం నాగిలిగొండ లోని ఆయన నివాసానికి వెళ్లి సీతయ్య, మృతదేహాంపై పార్టీ జెండా ఉంచి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ సీతయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో కొరియర్ గా పనిచేశారని, బ్రతికినంతకాలం ఎర్రజెండా ని ఎత్తుకొని పార్టీ అభివృద్ధి కోసం ఎంతగానో కృషిచేశాడన్నారు.ఈ ప్రాంతంలో కమునిస్టు ఉద్యమం బలపడటానికి సీతయ్య పాత్ర ఎనలేనిదన్నారు. సీతయ్య కుటుంబం కూడా తండ్రి బాటలోనే నడుస్తుందన్నారు. సీతయ్య కుమారుడు రవీంద్రబాబు జిల్లా కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తున్నాడన్నారు. సీతయ్య కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.

నివాళులర్పించిన వారిలో పార్టీ జాతీయ నమితి సభ్యులు భాగం హేమంతరావు, జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొండవర్తి గోవిందరావు, ఎర్రా బాబు దొండపాటి రమేష్, ఏవూరి లతాదేవి, పోటు కళావతి, ఏనుగు గాంధీ, పావులూరి మల్లిఖార్జునరావు, కూచివుండి రవి. ఏనుగు వెంకటేశ్వరరావు. పార్టీ మండల కార్యదర్శి దూసరి గోపాలరావు, సహాయ కార్యదర్శి అబ్బూరి మహేష్ జిలా కౌన్సిల్ సభ్యులు రాసాల మోహన్ రావు, తాటి నిర్మల, కన్నెబోయిన విజయమ్మ, ఏసు, నేరడ, బస్వాపురం నర్పంచులు దూసరీ నేతాజీ, ఆవుల నర్సింహారావు, సిపిఐ నాయకులు తాళ్లూరి యాదగిరి, తాళ్లూరి పుల్లయ్య, బొడ్డు కొండలరావు, నక్కనబోయిన కృష్ణ నారపోగు నాగార్జున నాగిలిగొండ శాఖ కార్యదర్శి చాట్ల రమేష్ , బాబు, ముఖర్జీ, షేక్ చిన్న జాన్, షేక్ హుస్సేన్, ఏపూరి నర్సయ్య తదితరులు నివాళులర్పించారు.

వలు పార్టీనాయకుల నివాళి..

సీతయ్య మృతదేహానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, మత్కేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వర్లు, మడుపల్లి భాస్కర్, పెంట్యాల అప్పారావు, పెంట్యాల పుల్లయ్య. మాజీ ఎంపీపీ కోపూరి వూర్ణయ్య, ఆలన్యం బసవయ్య, కాండ్ర పిచ్చయ్య, టీడీపీ మండలఅధ్యక్షుడు  తేలుకుంట్ల శ్రీను, బారాన మండల కార్యIMG-20260131-WA0045దర్శి బొడ్డు వెంకటరామారావు, మాజీ వైస్ ఎంపీపీ గురిజాల హనుమంతరావు, మంకెన రమేష్, వేముల నర్సయ్య, వంకాయలపాటి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ చాట్ల సురేష్, గడ్డం శ్రీను, సీపీఎం  మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, నాయకులు కొండ్రు జానకిరామయ్య, ఓబెనబోయిన వీరబాబు, మద్దిని బసవయ్య తదితరులు నివాళులర్పించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గ్రామీణ వైద్యుల శిక్షణను తిరిగి ప్రారంభించాలి గ్రామీణ వైద్యుల శిక్షణను తిరిగి ప్రారంభించాలి
--- ప్రతి వెయ్యి మందికి ఒక గ్రామీణ వైద్యుడిని నియమించి గౌరవ వేతనం ఇవ్వాలి--- తెలంగాణ మైనారిటీ గ్రామీణ వైద్యుల సంఘం 12వ మహాసభలో  స్పర్శ సామాజిక...
స్పోర్ట్స్ మీట్ తో విద్యార్థుల్లో నూతన ఉత్తేజం పెంపొందుతుంది.
ధన్యజీవి ఏపూరి సీతయ్య
ప్రత్యేక సమగ్ర సవరణను పకడ్బందీగా నిర్వహించాలి.. 
ప్రభుత్వ ప్రాధాన్యత పనుల పూర్తిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.... 
మైనారిటీ సొసైటీల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రవేశ పరీక్ష కు దరఖాస్తుల ప్రారంభం
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా 4వ వార్డులో ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రచారం