గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం
ఖమ్మం బ్యూరో ,జనవరి 17 (తెలంగాణ ముచ్చట్లు)
కూసుమంచిలో గిరిజన బాలుర హాస్టల్ నందు గిరిజన సంక్షేమ శాఖ, ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో
వసతి గృహ సంక్షేమ అధికారులకు మరియు ప్రధానోపాధ్యాయులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి నారీ విజయలక్ష్మి విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వసతి గృహాలలో నిర్వహించాల్సిన రికార్డుల ప్రాముఖ్యత, నిబంధనల ప్రకారం నిర్వహణ విధానం, పర్యవేక్షణ అంశాలపై విస్తృతంగా అవగాహన కలిగి ఉండాలని,
త్వరలో జరిగే 10వ తరగతి పరీక్షలలో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా గిరిజన సంక్షేమ వసతి గృహాలలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూను ఖచ్చితంగా, సక్రమంగా అమలు చేయాలని, భోజన నాణ్యత, పోషక విలువలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
తదనంతరం రికార్డుల నిర్వహణపై నిపుణులచే శిక్షణ ఇప్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఖమ్మం ఏటీడీవో సత్యవతి, వైరా ఐటీడీవో ఏసీఎంఓ స్థానిక వసతి గృహ సంక్షేమ అధికారి కే తిరుపతి రావు,గిరిజన సంక్షేమ శాఖకు చెందిన ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Comments