ఎంపిఆర్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
_పరమేశ్వర్ రెడ్డి టాస్ వేస్తూ అధికారిక ప్రారంభం
_క్రీడాకారుల్లో ఉత్సాహం, మానసిక ఉల్లాసం పెంపొందించడానికి ఇలాంటి టోర్నమెంట్‌లు అవసరం
రామాంతపూర్, జనవరి 17 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం రామాంతపూర్ డివిజన్ అధ్యక్షులు మొహమ్మద్ రఫిక్ ఆధ్వర్యంలో రామాంతపూర్ చిన్న చెరువు వద్ద నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌ను ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, టాస్ వేస్తూ అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి క్రీడా పోటీలు క్రీడాకారుల్లో మానసిక ఉల్లాసం మరియు ఉత్సాహాన్ని నింపడంలో కీలకంగా ఉంటాయని అన్నారు. రఫిక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ఆయన అభినందనలు తెలిపారు.పరమేశ్వర్ రెడ్డి , గత ప్రభుత్వంలో క్రీడలకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని, ప్రజా ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ పాలసీ ద్వారా గ్రామీణ క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గంలో ప్రతి క్రీడాకారుడికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు: మొహ్మద్ తోఫిక్, మహమ్మద్ రఫీక్, ఆకారపు అరుణ్, కంది శ్రవణ్, వల్లపు శ్రీకాంత్ యాదవ్, గరిక సుధాకర్, నామ్ రాజిరెడ్డి, అంగాల సందీప్, పూస సత్తయ్య, గంగపుత్ర భాస్కర్, మొగిలి లింగం, బుల్లెట్ అశోక్, సందీప్, భాస్కర్, మీట్టు, జిల్లు, సత్తిరెడ్డి, వజీర్ బాబా, సాయి, శాగా శ్రీధర్, అంబికా మహేష్, సూర్య, ఐకాన్ మధు, స్వామి, మొహమ్మద్ జాంగిర్, చిన్న, కాషామల్లా శంకర్, కిషోర్, గాదె రఘు, పాషా, నర్సింగరావు, నయీమ్, రవి స్థానికులు అన్నారు, ఈ టోర్నమెంట్ ద్వారా యువతలో క్రీడాప్రతిభను అభివృద్ధి చేయడంలో, క్రీడాకారులఉత్సాహాన్ని పెంపొందించడంలో ఇది పెద్ద ప్రేరణగా ఉంటుందని భావిస్తున్నారు. 


Comments