నారపల్లి పీహెచ్‌సీలో జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన అవగాహన కార్యక్రమం
మేడ్చల్ మల్కాజిగిరి, జనవరి 30 (తెలంగాణ ముచ్చట్లు)
మెడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలోని నారపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (పీహెచ్‌సీ) ఎన్‌ఎల్‌ఈపీ (జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమం) ఆధ్వర్యంలో కుష్ఠు వ్యాధిపై అవగాహన కార్యక్రమం శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సంవత్సరం “వివక్షతను అంతం చేయడం – గౌరవాన్ని నిర్ధారించడం” అనే ప్రధాన అంశంతో కార్యక్రమాన్ని నిర్వహించారు.కుష్ఠు వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు 30-01-2026 నుంచి 13-02-2026 వరకు పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.ప్రజలు ఇలాంటి ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని డా. శ్రీదేవి (ప్రోగ్రాం అధికారి) విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో విజయవంతంగా చికిత్స పొందుతున్న ఒక లెప్రసీ రోగిని సన్మానించారు.ఈ కార్యక్రమంలో డా. శ్రీదేవి (ప్రోగ్రాం అధికారి), డా. సత్యవతి (డిప్యూటీ డీఎంహెచ్ఓ), డా. శోభన
(పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్), సింహారాజు (డీపీఎంఓ), పల్లెదావాఖానా వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.


Comments