19వ వార్డులో గులాబీ–ఎరుపు సమన్వయ ప్రచారం జోరు.
- ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.
- పాకలపాటి లక్ష్మీ.
సత్తుపల్లి, జనవరి 31 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి పట్టణ పురపోరు ఎన్నికల్లో 19వ వార్డులో గులాబీ–ఎరుపు దళం సమన్వయంతో సాగుతున్న ప్రచారం హోరెత్తుతోంది. బీఆర్‌ఎస్ మద్దతుతో సీపీఎం కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్న పాకలపాటి లక్ష్మీ గడపగడపకు తిరుగుతూ ఓటర్లను కలుసుకుంటున్నారు. శనివారం నాటికి వార్డులోని ప్రతి ఓటరును మూడుసార్లు ప్రత్యక్షంగా కలసి, సుత్తి–కొడవలి–నక్షత్రం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. బీఆర్‌ఎస్, సీపీఎం నేతలు సుమారు 40 మంది కలిసి కాలినడకన ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆప్యాయంగా పలకరించారు. కరచాలనం చేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులోని మౌలిక వసతుల సమస్యలపై నిరంతరం పోరాడుతానని పాకలపాటి లక్ష్మీ హామీ ఇచ్చారు. ముఖ్యంగా సైడ్ డ్రైన్ల నిర్మాణం, అంతర్గత రహదారుల అభివృద్ధి, పెన్షన్ల మంజూరు, పక్కా ఇళ్లు, పట్టణ పేదలకు ఉపాధి హామీ పథకం అమలు వంటి అంశాలపై ప్రభుత్వంపై గళం విప్పుతానని ఆమె స్పష్టం చేశారు.
ఈ ప్రచార కార్యక్రమంలో సీపీఎం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు, జాజిరి శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు కంచర్ల నాగేశ్వరరావు, నాగార్జున వెంకటాచారి, పరిమి వెంకటేశ్వరరావు, కొత్తపల్లి నరసింహారావు, మోరంపూడి వెంకటేశ్వరరావు, రాగం సత్యనారాయణ, శ్రావణ్‌తో పాటు సీపీఎం కార్యకర్తలు రావుల రాజబాబు, మల్లూరు చంద్రశేఖర్, పాకలపాటి ఝాన్సీ, పాకలపాటి శ్రీను, మల్లికార్జునరావు, చప్పిడి భాస్కర్, రాయల రాణీ రుద్రమ్మదేవి, జాజిరి జ్యోతి, చీకటి అజిత తదితరులు పాల్గొన్నారు.


Comments