ప్రభుత్వ ప్రాధాన్యత పనుల పూర్తిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.... 

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రభుత్వ ప్రాధాన్యత పనుల పూర్తిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.... 

ఖమ్మం బ్యూరో, జనవరి -31(తెలంగాణ ముచ్చట్లు)

ప్రభుత్వ ప్రాధాన్యత పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి, త్వరితగతిన పూర్తికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో అధికారులతో దళిత బంధు, మెప్మా, సోలార్ పవర్ ప్లాంట్స్, టూరిజం, భూసేకరణ, ఇందిరా మహిళా డైరీ, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, అక్షయపాత్ర, ప్రభుత్వ కళాశాలల పై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, జిల్లాలో ప్రాధాన్యత క్రమంలో చేపట్టే పనులు వ్యక్తిగత శ్రద్ధతో త్వరితగతిన పూర్తికి చర్యలు చేపట్టాలన్నారు.దళిత బంధు యూనిట్ల పెండింగ్ విడుదల పూర్తి చేయాలన్నారు. డైవర్ట్ అయిన యూనిట్ల విషయంలో చర్యలు వేగవంతం చేయాలన్నారు. మధిర నియోజకవర్గంలో మెప్మా కార్యకలాపాలు చేపట్టాలన్నారు. క్రొత్తగా 200 పట్టణ స్వయం సహాయక సంఘాలను ఏర్పాటుకు, 2000 మంది క్రొత్త సభ్యులను చేర్పుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. మధిర లో శిక్షణా కేంద్రం ఏర్పాటుకు స్థలం గుర్తించాలని అన్నారు. బల్క్ గా యూనిట్ల తయారీకి ఏజన్సీ తో టై అప్ చేయాలన్నారు. వీక్లి కార్యాచరణ ప్రణాళిక చేయాలన్నారు.

ఎర్రుపాలెం మండలం రాజుపాలెం, కల్లూరు మండలం చిన్న కోరుకోండి లలో ఏర్పాటుచేస్తున్న ఒక మెగా వాట్ సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. మహిళా దినోత్సవం మార్చి 8 లోపు పూర్తయ్యేలా కార్యాచరణ చేయాలన్నారు. ఖమ్మం లేక్ వ్యూ క్లబ్ పనులు వేగవంతం చేయాలన్నారు. జమలాపురం పర్యాటక అభివృద్ధి పనుల్లో చైన్ లింక్ ఫెన్సింగ్ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని, సెక్యూరిటీ క్యాబిన్, టికెట్ కౌంటర్, చిల్డ్రన్ ప్లే ఏరియా, అడ్వాంచర్ పార్క్ పనులు పూర్తి చేయాలన్నారు.

బౌద్ధస్తూపం పనులు వేగవంతం చేయాలన్నారు. స్తూపం వద్ద పనులతోపాటు, పర్యాటకుల ఆకర్షణకు బాలసముద్రం చెరువులో బోటింగ్, బండ్ అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. మెడిటేషన్ కేంద్రంతో బౌద్ధ స్థూపాన్ని చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు. గుర్రాలపాడు అసంపూర్తి డబుల్ బెడ్ రూమ్ ల వద్ద కమర్షియల్ కాంప్లెక్స్, హెల్త్ సబ్ సెంటర్, చెల్డ్రెన్స్ పార్క్ ల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేయాలన్నారు. హరిత హోటల్ నిర్మాణానికి స్థల గుర్తింపు చేయాలన్నారు. రాయపట్నం హై లెవల్ బ్రిడ్జ్, మధిర  ఓఆర్ఆర్ లకు స్థల సేకరణ పూర్తి చేయాలన్నారు. వైరా డంపింగ్ యార్డ్ కు కావాల్సిన స్థల సేకరణ పూర్తి చేయాలన్నారు.

ఇందిరమ్మ మహిళా డెయిరీ ఏర్పాటుకు ఇంకనూ చేపట్టాల్సిన చర్యలను వేగం చేయాలన్నారు. పాల ధర ఎక్కువ వచ్చేలా హెరిటేజ్, మదర్, అమూల్ డెయిరీలను సంప్రదించాలన్నారు. మరో విడత గేదెల కొనుగోలు ప్రక్రియ చేపట్టాలన్నారు. ఇజిఎస్ లో క్యాటిల్ షెడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. బిఎంసియు ల ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. తెలంగాణ మాడల్ స్కూళ్ల నిర్మాణానికి చర్యలు వేగవంతం చేయాలన్నారు. స్కూళ్ల నమూనా, ఖర్చు వివరాలతో ప్రణాళిక చేయాలన్నారు. 12 స్కూళ్ల అభివృద్ధి లో భాగంగా స్కూళ్లలో స్థలం లభ్యత, చేపట్టాల్సిన సౌకర్యాలపై నివేదిక సమర్పించాలన్నారు. అక్షయపాత్ర ద్వారా హైజనిక్ ఫుడ్ అందుతుందని కలెక్టర్ అన్నారు. సెంట్రలైజ్ కిచెన్ ల ఏర్పాటుకు స్థల సేకరణ చేయాలన్నారు. 

మధిర డిగ్రీ కళాశాల, సిరిపురం ఐటిఐ , సిరిపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల, మధిర జూనియర్ కళాశాల, బనిగండ్లపాడు జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. కళాశాల ల మరమ్మతులకు మంజూరైన నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. వైరా, సత్తుపల్లి, పాలేరు, మధిర, ఖమ్మం నియోజకవర్గాల్లో మంజూరైన వీటిలో, వైరా, సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. మిగతా చోట పురోగతిలో ఉన్న పనుల్లో వేగం పెంచాలని, పూర్తయిన పనుల రికార్డులు నమోదుచేసి, బిల్లుల చెల్లింపుకు వెంట వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ అన్నారు. కెజిబివి స్కూళ్ల పెయింటింగ్ చేయాలన్నారు. ప్రాధాన్యత పనుల పూర్తికి అధికారులు పర్యవేక్షణ చేస్తూ, రోజువారీ పనుల పురోగతిని సమీక్షించాలన్నారు.

ఈ సమావేశంలో ఎస్డీసి రాజేశ్వరి, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, డిఇఓ చైతన్య జైని, విద్యుత్ శాఖ ఎస్ఇ శ్రీనివాస చారి, ఇడి ఎస్సి కార్పొరేషన్ నవీన్ బాబు, జిల్లా టూరిజం అధికారి సుమన్ చక్రవర్తి, అటవీ అభివృద్ధి అధికారిణి మంజుల, డిఆర్డీవో శ్రీరామ్, హౌజింగ్ పిడి శ్రీనివాస్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవి బాబు, విద్యాశాఖ ఇఇ బుగ్గయ్య, పీఆర్ ఇఇ మహేష్ బాబు, ఐటిఐ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గ్రామీణ వైద్యుల శిక్షణను తిరిగి ప్రారంభించాలి గ్రామీణ వైద్యుల శిక్షణను తిరిగి ప్రారంభించాలి
--- ప్రతి వెయ్యి మందికి ఒక గ్రామీణ వైద్యుడిని నియమించి గౌరవ వేతనం ఇవ్వాలి--- తెలంగాణ మైనారిటీ గ్రామీణ వైద్యుల సంఘం 12వ మహాసభలో  స్పర్శ సామాజిక...
స్పోర్ట్స్ మీట్ తో విద్యార్థుల్లో నూతన ఉత్తేజం పెంపొందుతుంది.
ధన్యజీవి ఏపూరి సీతయ్య
ప్రత్యేక సమగ్ర సవరణను పకడ్బందీగా నిర్వహించాలి.. 
ప్రభుత్వ ప్రాధాన్యత పనుల పూర్తిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.... 
మైనారిటీ సొసైటీల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రవేశ పరీక్ష కు దరఖాస్తుల ప్రారంభం
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా 4వ వార్డులో ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రచారం