బీసీ వసతి గృహాల్లో సామాజిక న్యాయంపై అవగాహన కార్యక్రమాలు

బీసీ వసతి గృహాల్లో సామాజిక న్యాయంపై అవగాహన కార్యక్రమాలు

మెడ్చల్–మల్కాజ్‌గిరి, ఫిబ్రవరి 04 (తెలంగాణ ముచ్చట్లు):

బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌ మరియు మెడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు సామాజిక న్యాయ దినోత్సవాన్ని జిల్లాలోని అన్ని ప్రభుత్వ బీసీ కళాశాల వసతి గృహాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలు విద్యార్థుల్లో సామాజిక సమానత్వం, న్యాయం, రాజ్యాంగ విలువలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా వసతి గృహాల్లో విద్యార్థులతో సామాజిక న్యాయంపై ప్రతిజ్ఞ చేయించగా, అనంతరం వ్యాసరచన పోటీలు మరియు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు సామాజిక అసమానతలు, న్యాయం, సమాన హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ వంటి అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అధికారులు అభినందించి బహుమతులు అందజేశారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, నైతిక విలువలు పెరుగుతాయని వారు పేర్కొన్నారుIMG-20260204-WA0047. భవిష్యత్‌లో కూడా ఈ తరహా అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .