ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ కమిటీ ఎన్నిక
ఉప్పల్ , ఫిబ్రవరి 04 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీ కార్యవర్గ సభ్యులు ఉప్పల్ ఎక్సైజ్ సీఐ ఓంకార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను ఆయన ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా సీఐ ఓంకార్ మాట్లాడుతూ, సమాజంలో ప్రజలకు వాస్తవాలను తెలియజేయడంలో మీడియా కీలకమైన, బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తోందని అన్నారు.ఉప్పల్ ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా క్లబ్ నూతన కమిటీ సభ్యులు ప్రజా సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకువచ్చేలా పనిచేయాలని ఆకాంక్షించారు. చట్టపరమైన అవగాహన కల్పించడంలో, సామాజిక బాధ్యతను పెంపొందించడంలో మీడియా మరింత చురుకుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.ఉప్పల్ ప్రాంతంలో శాంతిభద్రతలు, ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశాల్లో మీడియా సహకారం ఎల్లప్పుడూ అవసరమని పేర్కొన్న ఆయన, ఉప్పల్ ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా క్లబ్‌కు, నూతన కమిటీకి ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ తరఫున పూర్తి సహాయ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమాన్ని ఉప్పల్ ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా క్లబ్ అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్ వడ్డేపల్లి కిషోర్ఆధ్వర్యంలో నిర్వహించారు.


Comments