దీనదయాళ్ నగర్‌లో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం

పాత ఆర్ ఆర్ డ్రైన్ స్థానంలో కొత్త ఆర్సీసీ పైపులైన్ ఏర్పాటు

దీనదయాళ్ నగర్‌లో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం

వినాయక్ నగర్, ఫిబ్రవరి 04 (తెలంగాణ ముచ్చట్లు):

మల్కాజ్గిరి నియోజకవర్గం వినాయక్ నగర్ డివిజన్ దీనదయాళ్ నగర్ పరిధిలోని రోడ్ నంబర్–5 వద్ద ఉన్న పాత ఆర్ ఆర్ డ్రైన్ పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో పాత డ్రైన్‌ను తొలగించి కొత్త ఆర్సీసీ పైపులైన్‌ను ఏర్పాటు చేశారు.పాత డ్రైన్ కూలిపోయి ప్రమాదకరంగా మారడంతో వర్షాకాలంలో మురుగు నీరు రోడ్డుపైకి వచ్చి దుర్వాసన, దోమల బెడదతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఆధునిక సాంకేతిక ప్రమాణాలతో ఆర్సీసీ పైపులైన్ ఏర్పాటు పనులు చేపట్టారు.ఈ అభివృద్ధి పనులను కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి, బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబెర్ ఓం ప్రకాష్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ ఏఈ నవీన్, సూపర్వైజర్ సాగర్ పనుల వివరాలను వారికి తెలియజేశారు. నాణ్యతలో ఎలాంటి లోపాలు లేకుండా పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, కాలనీవాసుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు మరియు కాలనీ వాసులు పాల్గొని అభివృద్ధి పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం
వనపర్తి,ఫిబ్రవరి4(తెలంగాణ ముచ్చట్లు): రానున్న మరో ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని, నిరుపేదలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వనపర్తి...
ఎస్సీ విద్యార్థుల ప్రీ మెట్రిక్ స్కాలర్‌ షిప్ నమోదు వేగవంతం చేయాలి
నితిన్ నబిన్ బహిరంగ సభకు బయలుదేరిన పెద్దమందడి బీజేపీ నాయకులు
వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేయాలి
మనిగిల్ల ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవాలపై చర్చ
ఎల్లంపేట్‌లో అక్రమ మద్యం స్వాధీనం
6వ వార్డులో బీజేపీ ప్రచార హోరు.