సత్తుపల్లిలో  మున్సిపాలిటీ లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి.

సత్తుపల్లిలో  మున్సిపాలిటీ లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి.

.- 23 వార్డుల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యం.
- ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్.

సత్తుపల్లి, ఫిబ్రవరి 3 (తెలంగాణ ముచ్చట్లు):

ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి మున్సిపాలిటీని కైవసం చేసుకుంటుందని, సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యురాలు మట్టా రాగమయి దయానంద్ ధీమా వ్యక్తం చేశారు. సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 23 వార్డులకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను ప్రకటించి, వారికి బీ–ఫారమ్‌లు అందజేశారు. ఈ సందర్భంగా బీ–ఫారమ్‌లు పొందిన అభ్యర్థుల వివరాలను వెల్లడించారు.1వ వార్డు – మట్టా ప్రసాద్, 2వ వార్డు – నాయుడు రాధిక, 3వ వార్డు – బొంతు సుమలత, 4వ వార్డు – షేక్ మౌలాలి, 5వ వార్డు – షేక్ అకీమ్ పాషా, 6వ వార్డు – తోట సుజల రాణి, 7వ వార్డు – మహమ్మద్ నసీమా, 8వ వార్డు – బండారు శరత్ చంద్ర, 9వ వార్డు – జగన్మాదం శ్రీను, 10వ వార్డు – మట్టా దేవజ్యోతి, 11వ వార్డు – ఎస్‌కే నాగుల్ మీరా, 12వ వార్డు – సింగపావు నాగలక్ష్మి, 13వ వార్డు – ఉప్పు నాగమణి, 14వ వార్డు – పింగళి శామ్యూల్, 15వ వార్డు – దూదిపాళ్ల రాంబాబు, 16వ వార్డు – జొన్నలగడ్డ శ్రీనివాసరావు, 17వ వార్డు – చావా స్వరూపా రాణి, 18వ వార్డు – పర్సా మానస, 19వ వార్డు – కర్నాటి విజయకుమారి, 20వ వార్డు – మహమ్మద్ కమల్ పాషా, 21వ వార్డు – మందపాటి ప్రభాకర్ రెడ్డి, 22వ వార్డు – మహమ్మద్ రహానా బేగం, 23వ వార్డు – విరివాడ అపర్ణ.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాగమయి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి విస్తృత మద్దతు లభిస్తున్నదని అన్నారు. ప్రజల ఆశీస్సులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల దీవెనలతో, సత్తుపల్లి మున్సిపాలిటీలోని 23 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచి, మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోనుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.IMG-20260203-WA0010

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .