అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించిన కార్పొరేటర్ ప్రభుదాస్

అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించిన కార్పొరేటర్ ప్రభుదాస్

నాచారం, ఫిబ్రవరి 04 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ మీర్పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలోని హెచ్‌బీ కాలనీ ఫేజ్–1 ఓం శాంతి బిల్డింగ్ గల్లీలో చేపట్టిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ పరిశీలించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, డివిజన్ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. కాలనీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. డివిజన్ అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కి, అలాగే డివిజన్ నాయకులకు కార్పొరేటర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ అధికారి వేణుగోపాల్, కాలనీ అధ్యక్షుడు శివరాం ప్రసాద్, గోవింద రెడ్డి, చారి, శేఖర్ గౌడ్‌తో పాటు కాలనీ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .