మనిగిల్ల ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవాలపై చర్చ

మనిగిల్ల ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవాలపై చర్చ

పెద్దమందడి,ఫిబ్రవరి4(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం నిర్వహించనున్న వార్షికోత్సవ కార్యక్రమాలపై ఉపాధ్యాయులు గ్రామ సర్పంచ్ తో పాటు చర్చ జరిగింది.ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య సార్, ఉపాధ్యాయులు రాములు , జానయ్య  పాటు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ ముప్పూర్ గణేష్ కుమార్ల సమక్షంలో పాఠశాల వార్షికోత్సవాల నిర్వహణ, విద్యార్థులకు అవసరమైన వసతులు, అలాగే పాఠశాల అభివృద్ధి మరియు సమస్యలపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా పాఠశాల ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఉపాధ్యాయులు సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. వాటి పరిష్కారానికి సహకరిస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు.విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించే విధంగా వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు గణేష్ బికె, సాయి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .