ఏఎన్ఆర్ గార్డెన్స్‌లో శాంతి సాయిజెన్ శేఖర కు ఘన సన్మానం

సాయి జన్ శేఖర్ పుట్టినరోజు వేడుకలు

ఏఎన్ఆర్ గార్డెన్స్‌లో శాంతి సాయిజెన్ శేఖర కు ఘన సన్మానం

నాచారం, ఫిబ్రవరి 04 తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ కార్పొరేటర్‌గా పదేళ్ల పాటు డివిజన్ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ ని ఘనంగా సన్మానించారు. అదే విధంగా బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాయి జన్ శేఖర్  పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకలను ఏఎన్ఆర్ గార్డెన్స్, నాచారంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి  హాజరై మాట్లాడుతూ, నాచారం డివిజన్ అభివృద్ధిలో శాంతి సాయిజెన్ శేఖర్  సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన ఆయన సేవలు మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. అలాగే సాయి జన్ శేఖర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, హౌసింగ్ బోర్డ్ కార్పొరేటర్ ప్రభుదాస్, చిల్కానగర్ కార్పొరేటర్ బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, మాజీ కార్పొరేటర్ గంధం జోష్నా, నాగేశ్వరరావు, కొత్త రామారావుతో పాటు నియోజకవర్గంలోని పలు డివిజన్లకు చెందిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.సుమారు 3,000 మందికి పైగా నాచారం డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ సంఘాల ప్రతినిధులు, పుర ప్రముఖులు, మునిసిపల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై శాంతి సాయిజెన్ శేఖర్ కి మరియు సాయి జన్ శేఖర్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.IMG-20260204-WA0034

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .