కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో ఏసీబీ మెరుపు దాడులు

కూకట్పల్లి జోనల్ కార్యాలయంలో ఏసీబీ మెరుపు దాడులు

మేడ్చల్ మల్కాజిగిరి, ఫిబ్రవరి 04 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కూకట్పల్లి జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్‌ఈ) చిన్నారెడ్డి ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.15 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.పెండింగ్‌లో ఉన్న బిల్లుల క్లియరెన్స్ కోసం లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. బాధిత కాంట్రాక్టర్ నుంచి ఫిర్యాదు అందడంతో ముందస్తు ప్రణాళికతో వలపన్నిన అధికారులు, లంచం స్వీకరిస్తున్న సమయంలోనే ఎస్‌ఈని అదుపులోకి తీసుకున్నారు.ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని ఏ మాత్రం సహించబోమని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ ఘటనతో జీహెచ్ఎంసీ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .