ప్రజాయుద్ధనౌక గద్దర్ జయంతి వేడుకలు 

ప్రజాయుద్ధనౌక గద్దర్ జయంతి వేడుకలు 

కీసర, ఫిబ్రవరి 01(తెలంగాణ ముచ్చట్లు)

తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసి, ప్రజల్లో చైతన్యం రగిలించిన ప్రజాయుద్ధనౌక గద్దర్ జయంతిని సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. పోరాట తత్వం, దిక్కర వ్యక్తిత్వం, కదం తొక్కిన కలం, అలుపెరుగని గళంతో అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన గద్దర్ సేవలను ఈ సందర్భంగా నేతలు స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సైదులు మాట్లాడుతూ… గద్దర్ జీవితం మొత్తం ప్రజల పక్షానే సాగిందని, తెలంగాణ అస్తిత్వ పోరాటానికి ఆయన పాటలు, ప్రసంగాలు దిశానిర్దేశం చేశాయని అన్నారు. అణచివేతకు వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం నేటి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాదిగ జాగృతి మండల అధ్యక్షులు కొమ్ము రవి, ఎంఆర్‌పిఎస్ చీర్యాల గ్రామ అధ్యక్షులు బండారి నర్సింగరావు, ప్రధాన కార్యదర్శి బోడ వెంకటేష్, యువనాయకులు బత్తుల రామచందర్, సందాని ఆనంద్, వార్డు సభ్యులు కనకయ్య, కీసర మండల మాజీ సంయుక్త కార్యదర్శి కంచమీది సంతోష్, కట్ట శంకరయ్య, కత్తి గణేష్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏలూరి శ్రీనివాస్ ముదిరాజ్, బక్కని కుమార్–జె.కే తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .