మాఘ పౌర్ణమి సందర్భంగా హేమాద్రి వెంకటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ 

మాఘ పౌర్ణమి సందర్భంగా హేమాద్రి వెంకటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ 

కీసర, ఫిబ్రవరి 01(తెలంగాణ ముచ్చట్లు)

కీసర మండలం లో రాంపల్లి దయారా వెంకులోని గుట్టపై వెలసిన శ్రీ హేమాద్రి వెంకటేశ్వర స్వామి వారికి మాఘ పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేయడం అత్యంత శుభప్రదమని, ఫలప్రదమని వేదోత్తములు ఆదిత్య శర్మ, ఆంజనేయ శర్మ, శ్రీనివాస్ శర్మ  మార్గదర్శకత్వంలో నిర్ణయించిన శుభ ముహూర్తానికి గిరి ప్రదక్షిణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ కందాడి హనుమంత్ రెడ్డి, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించగా, హేమాద్రి వెంకటేశ్వర స్వామి సేవలో కీసర పోలీస్ స్టేషన్ సీఐ అర్కపల్లి ఆంజనేయులు  పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా హేమాద్రి వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను పల్లకీలో మోస్తూ భక్తులు స్వామి నామస్మరణతో, భక్తి గీతాలు, భజన పాటలతో ఆడుతూ పాడుతూ గిరి ప్రదక్షిణ చేశారు. ఆలయ పునర్నిర్మాణానికి సహకరిస్తున్న ధర్మదాతలు, రాంపల్లి దయారా గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని మరింత వైభవంగా నిర్వహించారుIMG-20260201-WA0042ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కందాడి హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ ఇకనుండి ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఉదయం 5 గంటలకు హేమాద్రి వెంకటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్‌లు కామసాని బాల్‌రెడ్డి, గరుగుల మల్లేష్, జాయింట్ సెక్రటరీ గాడి రాము, ఆర్గనైజింగ్ సెక్రటరీ పురుషోత్తం రెడ్డి, ట్రస్ట్ బోర్డు సభ్యులు ద్యాగాల సుధాకర్, వరగంటి నగేష్, బిట్ల గంగ సముద్రం, చొక్కపురం శ్రీరాములు, గురుగుల బాలనర్సింహా, గోక బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రజాయుద్ధనౌక గద్దర్ జయంతి వేడుకలు  ప్రజాయుద్ధనౌక గద్దర్ జయంతి వేడుకలు 
కీసర, ఫిబ్రవరి 01(తెలంగాణ ముచ్చట్లు) తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసి, ప్రజల్లో చైతన్యం రగిలించిన ప్రజాయుద్ధనౌక గద్దర్ జయంతిని సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. పోరాట తత్వం,...
మాఘ పౌర్ణమి సందర్భంగా హేమాద్రి వెంకటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ 
గ్రామీణ వైద్యుల శిక్షణను తిరిగి ప్రారంభించాలి
స్పోర్ట్స్ మీట్ తో విద్యార్థుల్లో నూతన ఉత్తేజం పెంపొందుతుంది.
ధన్యజీవి ఏపూరి సీతయ్య
ప్రత్యేక సమగ్ర సవరణను పకడ్బందీగా నిర్వహించాలి.. 
ప్రభుత్వ ప్రాధాన్యత పనుల పూర్తిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి....