ఎస్సీ విద్యార్థుల ప్రీ మెట్రిక్ స్కాలర్‌ షిప్ నమోదు వేగవంతం చేయాలి

జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి

ఎస్సీ విద్యార్థుల ప్రీ మెట్రిక్ స్కాలర్‌ షిప్ నమోదు వేగవంతం చేయాలి

మేడ్చల్–మల్కాజిగిరి, ఫిబ్రవరి 04 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన 9, 10వ తరగతి విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు అందించేందుకు అవసరమైన కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలని ఆయన సూచించారు.
బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి వినోద్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి విజయ కుమారి, ఎల్‌డీఎం శివ ప్రసాద్ తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ నమోదు కోసం ఎస్సీ విద్యార్థులకు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలను వెంటనే జారీ చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. నమోదు నుంచి ధృవీకరణ పత్రాల జారీ వరకు విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సంబంధిత తహసీల్దార్లతో సమన్వయం చేసుకుని జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.విద్యార్థులకు బ్యాంకు లేదా పోస్టల్ ఖాతా తెరవడంలో మార్గనిర్దేశం చేయాలని సూచించారు. 10 సంవత్సరాలు నిండిన విద్యార్థుల పేరపై పోస్టాఫీస్‌లో రూ.100తో ఖాతా ప్రారంభించి స్కాలర్‌షిప్‌కు అనుసంధానం చేయవచ్చని, ఇందుకు ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ ఉంటే సరిపోతుందని వివరించారు.జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి వినోద్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ వర్గాలకు చెందిన 9, 10వ తరగతి విద్యార్థులు అర్హులని, కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల లోపు ఉండాలని తెలిపారు. ఆధార్, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, బోనఫైడ్ సర్టిఫికేట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ లేదా పోస్టల్ ఖాతా వివరాలతో https://www.tgepass.cgg.gov.in� వెబ్‌సైట్‌లో ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌కు నమోదు చేసుకోవాలని సూచించారు.అనంతరం ప్రధానోపాధ్యాయుల సందేహాలకు అదనపు కలెక్టర్ సలహాలు, సూచనలు అందించారు.IMG-20260204-WA0055

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .