19వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయకుమారి విస్తృత ప్రచారం.

హస్తం గుర్తుకు ఓటేయాలని ఓటర్లకు విజ్ఞప్తి.

19వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయకుమారి విస్తృత ప్రచారం.

సత్తుపల్లి, ఫిబ్రవరి 4 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున 19వ వార్డు అభ్యర్థిగా బరిలో ఉన్న కర్నాటి విజయకుమారి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ఓటర్లను కలుసుకుంటూ పార్టీ విధానాలు, అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజల మద్దతు, ఆశీర్వాదంతో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా, కర్నాటి వెంకట నారాయణరెడ్డి సతీమణి అయిన విజయకుమారి వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో దొడ్డా కృష్ణారెడ్డి, కొల్లేటి నరసింహరావు, వెంకటనారాయణ రెడ్డి, గోపాల్, కృష్ణంరాజు, సత్యం, లక్ష్మీ, జీకే రెడ్డి, ప్రదీప్, సందీప్, వెంకటేశ్వరరావు, కోలేటి జమలమ్మ, కోలేటి తులసి, పరసా రాధా, మస్తాన్, బాజీ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో “హస్తం” గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను విజయకుమారి కోరారు. వార్డు అభివృద్ధిమౌలిక సదుపాయాల కల్పనకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.IMG-20260204-WA0037

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .