సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణానికి మంజూరు అయిన పత్రాల పంపిణీ

ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజితా పరమేశ్వర్ రెడ్డి

సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణానికి మంజూరు అయిన పత్రాల పంపిణీ

ఉప్పల్, ఫిబ్రవరి 04 (తెలంగాణ ముచ్చట్లు):

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పనిచేస్తున్నారని ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజితా పరమేశ్వర్ రెడ్డి అన్నారు. ఉప్పల్ డివిజన్‌ను జీహెచ్ఎంసీ పరిధిలోనే ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.ఉప్పల్ డివిజన్ పరిధిలోని న్యూ భారత్ నగర్, సౌత్ స్వరూప్ నగర్ కాలనీల్లో సుమారు రూ.2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించిన మంజూరు అయిన పత్రాలను కాలనీ వాసులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.న్యూ భారత్ నగర్‌లో రూ.80 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం, రూ.68 లక్షలతో బాక్స్ డ్రెయిన్ నిర్మాణం చేపట్టనుండగా, సౌత్ స్వరూప్ నగర్‌లో రూ.43 లక్షలతో దెబ్బతిన్న సీసీ రోడ్ల మరమ్మతులు, పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ అభివృద్ధి పనులతో కాలనీల్లో మౌలిక వసతులు మెరుగుపడతాయని, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందుతాయని రజితా పరమేశ్వర్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో న్యూ భారత్ నగర్ కాలనీ అధ్యక్షుడు జాజుల నాగేష్‌తో పాటు కప్పరి ఎల్లేశ్ కుమార్, సలా ప్రభాకర్ రెడ్డి, పూస మల్లేష్, అన్నపు రెడ్డి వెంకట్ రెడ్డి, గంధం సంపత్ గౌడ్, పంగ నర్సింహ రెడ్డి, ఉప్పల జగన్, చలపతి రావు మోహన్, నారి ఎల్లయ్య, దోమకొండ నర్సింహులు, మిష్టి లాల్, గొండ్ ప్రభాకర్, బాల చారి నర్సింహ చారి, కైలా కృష్ణ రెడ్డి, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.అలాగే సౌత్ స్వరూప్ నగర్ నుంచి గజ్జల వెంకటరెడ్డి, నర్సిరెడ్డి, ప్రతాపరెడ్డి, బసిరెడ్డి, భాష, రామచందర్, బర్ల కృష్ణ, జగన్నాథ్ పటేల్, సుబ్రహ్మణ్యం, రాజేశ్వరి, నారాయణ రావు, చాపల శీను, వినోద్, జాల వెంకటేష్, నరేష్‌తో పాటు యాదగిరి కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .