అభివృద్ధి మాట కాదు… బాధ్యత.!

20వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కమల్ పాషా హామీ.

అభివృద్ధి మాట కాదు… బాధ్యత.!

సత్తుపల్లి, ఫిబ్రవరి 4 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కమల్ పాషా అభివృద్ధిపై గట్టి హామీ ఇచ్చారు. “నేను మీలో ఒకడిని… మీ ఇంటి బిడ్డను” అంటూ ఇంటింటి ప్రచారంలో పాల్గొంటూ ప్రజల ఆశీర్వాదం కోరుతున్నారు.
ఈ సందర్భంగా కమల్ పాషా మాట్లాడుతూ, వార్డు ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు. సీసీ రోడ్ల నిర్మాణం, మెరుగైన సైడ్ డ్రైనేజీ వ్యవస్థ, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేదవారికి రేషన్ కార్డులు, ఇళ్లు, ఇళ్ల స్థలాల మంజూరుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే వార్డులో నెలకొన్న విద్యుత్ సమస్యను గుర్తించి, తన సొంత ఖర్చులతో కరెంటు పోల్స్ ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. ఇది తన సేవాభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. 20వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దే అవకాశం ఇవ్వండి అంటూ ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కమల్ పాషా ఓటర్లను కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో సీనియర్ నాయకులు అలవాల కరుణాకర్, రాయల కోటేశ్వరావు, గజ్జల శీను సంపత్, జూపాటి పాపారావు, ప్రణతి వెంకటేశ్వరావు, కొత్తపల్లి శివతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.IMG-20260204-WA0044

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .