ఆడపిల్లల విద్యను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి..... 

ఆడపిల్లల విద్యను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి..... 

–అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి

మైనారిటీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల గోడ ప్రతులను ఆవిష్కరించిన అదనపు కలెక్టర్

ఖమ్మం బ్యూరో, జనవరి -24(తెలంగాణ ముచ్చట్లు) 

ఆడపిల్లల విద్యను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్  పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. అదనపు కలెక్టర్ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శనివారం ముస్లిం మైనార్టీ ప్రతినిధులతో కలిసి మైనారిటీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 7 మైనారిటీ రెసిడెన్షియల్ విద్యాసంస్థలు నడుస్తున్నాయని, వీటిలో 6 నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన విద్య మైనారిటీలకు అందించడం జరుగుతుందని అన్నారు. ఖమ్మంలోని మైనారిటీ రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో చదివిన 38 మంది విద్యార్థులకు ఐఐటీ సీట్లు, 39 మంది ఎంబీబీఎస్, 11 మంది సీఏ, 14 మంది లా సెట్ క్రాక్ చేశారని తెలిపారు. మైనారిటీ జీవితాలలో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం మైనారిటీ విద్యా సంస్థలు ఏర్పాటు చేసిందని అన్నారు.  మనం బాగుపడాలంటే చదువు చాలా కీలకమని అన్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్, ప్రభుత్వ ఉపాధిలో మహిళలు బాగా రాణిస్తున్నారని అన్నారు. ముస్లిం వర్గాలలో బాలికల విద్యను ప్రోత్సహించాలని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలో సీట్లను పూర్తి స్థాయిలో భర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మహమ్మద్ ముజాహిద్, సిఐ రామకృష్ణ, రీజినల్ లెవెల్ కో ఆర్డినేటర్ ఎంజె అరుణకుమారి, ముస్లిం మత పెద్దలు, మస్జిద్ కమిటీ సదర్లు ( ప్రెసిడెంటు / సెక్రటరీ ), మైనారిటీ నాయకులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .