విజయం కావాలంటే... ముందు నిన్ను నువ్వు నమ్ముకో

విజయం కావాలంటే... ముందు నిన్ను నువ్వు నమ్ముకో

» ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు చెరుకూరి రమేశ్..

» జేవీఆర్ కళాశాలలో 'పరీక్షలా.. భయమేందుకు' అంశంపై విద్యార్థులకు అవగాహన

» మోటివేషన్ క్లాస్ విజయవంతం

» 400మందికి పైగా హాజరైన పదో తరగతి విద్యార్థులు, తల్లిదండ్రులు

ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 2(తెలంగాణ ముచ్చట్లు)

ఒక మనిషి జీవితంలో పైకి ఎద గాలంటే, ఇతరులపై కాకుండా తనపై తానే నమ్మకం పెట్టుకోవా లని.. అదే విజయానికి తొలి మెట్టు అని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు చెరుకూరి రమేశ్ అన్నారు. ఆదివారం కూసుమంచి మండల కేంద్రం లోని గ్లోబల్ రెయిన్ బో జేవీఆర్ కళాశాలలో పదో తరగతి విద్యా ర్థులు, తల్లిదండ్రులకు 'పరీక్షలా.. భయమేందుకు' అంశంపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రమేశ్ మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులకు పరీక్షలను ఎలా రాయాలో మెళకువలు నేర్పించారు. నమ్మకం ఉన్న చోట భయానికి చోటు ఉండదన్నారు. మిమ్మల్ని మీరు నమ్మితే, ప్రపంచం మిమ్మల్ని నమ్ముతుందన్నారు. నేను చేయగలను అన్న భావనే భయాన్ని ఓడిస్తుందన్నారు. నాకు రాదు అనేది కాకుండా నేను నేర్చుకుంటున్నాను గా మార్చండి... మన మాటలే మన మనసును నియం త్రిస్తాయన్నారు. ఎంత చదివామన్నది కాదు, ఎంత రాయగల మన్నదే పరీక్షలో ముఖ్యం. మనలో ఉన్న శక్తి, సామర్ధ్యాలపై మనకే నమ్మకం లేకపోతే అవి బయటికి రావన్నారు. చాలా మంది విద్యార్థుల్లో భయం ఉంటుం దన్నారు. దానిని వీడితే విజయం సొంతం అవుతుందన్నారు. మన మీద మనకు నమ్మకం ఉంటే ప్రపంచం మనల్ని నమ్మక తప్పదన్నారు. చదువుకునేందుకు మంచి వాతావరణాన్ని సృష్టించుకోవాలన్నారు.. టీవీ, ఫోన్, కంప్యూటర్, మ్యూజిక్ ప్లేయర్కి దూరంగా ఉండాలి. స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకోని ఏకాగ్రతతో చదవాలన్నారు. ఏ పనికి ఎంత సమయం కేటాయించాలో పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలన్నారు. యోగా, ధ్యానం మొదలైన టెక్నిక్స్ ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్ర మానికి 400మందికి పైగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పదో తరగతి విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరైనారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ రెయిన్ బో జేవీఆర్ కళాశాల కరస్పాడెంట్ మహ్మద్ ఏర్పాద్ అహ్మద్ మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులకు పరీక్షలంటే భయం పోయేలా అవగాహనIMG-20260202-WA0033 కల్పించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జేవీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ శేఖర్ రెడ్డి, ఇన్ చార్జులు పాపారావు, నాజియా, కళాశాల లెక్చరర్లు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అక్షరం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన....తుంబూరు దయాకర్ రెడ్డి అక్షరం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన....తుంబూరు దయాకర్ రెడ్డి
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 2 (తెలంగాణ ముచ్చట్లు) సమాజహితం పనిచేస్తూ పత్రికా రంగంలో దినదిన అభివృద్ధి చెందుతున్న అక్షరం న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ ను మంత్రి...
విజయం కావాలంటే... ముందు నిన్ను నువ్వు నమ్ముకో
విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.!
ప్రజాయుద్ధనౌక గద్దర్ జయంతి వేడుకలు 
మాఘ పౌర్ణమి సందర్భంగా హేమాద్రి వెంకటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ 
గ్రామీణ వైద్యుల శిక్షణను తిరిగి ప్రారంభించాలి
స్పోర్ట్స్ మీట్ తో విద్యార్థుల్లో నూతన ఉత్తేజం పెంపొందుతుంది.