ఎల్లంపేట్‌లో అక్రమ మద్యం స్వాధీనం

ఎల్లంపేట్‌లో అక్రమ మద్యం స్వాధీనం

మేడ్చల్–మల్కాజిగిరి, ఫిబ్రవరి 04 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మూడు మున్సిపాలిటీల, మున్సిపల్ కార్పొరేషన్ల సాధారణ ఎన్నికలు–2026 నేపథ్యంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఎన్నికల నిబంధనలను అధికారులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని రావల్‌కోల్ గ్రామంలో ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహించింది.తనిఖీల సందర్భంగా కె. సాయి కుమార్ (తండ్రి: పాండు) నివాసంలో అక్రమంగా నిల్వ ఉంచిన 12.72 లీటర్ల మద్యంను ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం, పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్వాధీనం చేసిన మద్యాన్ని స్థానిక ఎస్సై మన్మధ కొనారికి అప్పగించారు.ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అక్రమ మద్యం నిల్వలు, రవాణా, పంపిణీపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .