వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేయాలి

డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి

వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేయాలి

వనపర్తి,ఫిబ్రవరి4(తెలంగాణ ముచ్చట్లు):

రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోందని, రైతు కుటుంబాలు అప్పుల భారంతో ఇబ్బందులు పడుతున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలిపారు. సిచువేషన్ అసెస్మెంట్ సర్వే 2018–19 గణాంకాలు ఈ పరిస్థితిని స్పష్టంగా చూపుతున్నాయని అన్నారు.సర్వే ప్రకారం రాష్ట్రంలో ఒక్కో రైతు కుటుంబంపై సగటున రూ.1,52,113 అప్పు ఉన్నట్లు తెలిపారు. జాతీయ సగటు రైతు కుటుంబ నెలసరి ఆదాయం రూ.10,218 కాగా, తెలంగాణ రైతు కుటుంబాల సగటు ఆదాయం రూ.9,403గా ఉన్నట్లు వివరించారు.రాష్ట్రంలో 91 శాతం రైతు కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయని, 95 శాతం మంది సన్న, చిన్న, మధ్యతర రైతులేనని చెప్పారు. సరైన ఆదాయం లేకపోవడం, పంటలు గిట్టుబాటు కాకపోవడం వల్ల రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.రైతుల ఆదాయం పెంచేందుకు కేవలం సాంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా కూరగాయల సాగు, డైరీ ఫార్మింగ్, కోళ్ల, గొర్రెల పెంపకం, ఆయిల్ పామ్, సెరికల్చర్, పప్పుదినుసులు వంటి వ్యవసాయ అనుబంధ రంగాల వైపు దృష్టి సారించాలని సూచించారు.దీనికి అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ వ్యవసాయ విధానం ద్వారా రైతులకు స్థిర ఆదాయం సాధ్యమవుతుందని తెలిపారు. వరిని బియ్యంగా మార్చి మార్కెట్లో విక్రయించడం వంటి విలువ జోడింపు విధానాలు రైతులకు అదనపు లాభాలు అందిస్తాయని చెప్పారు.
వ్యవసాయం గిట్టుబాటుగా ఉండాలంటే నీటి లభ్యత కీలకమని, కృష్ణా, గోదావరి నదీ జలాలను ప్రతి ఎకరాకు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. గత రెండేళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ రంగం, రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు.వ్యవసాయానికి నీరు, నాణ్యమైన విత్తనాలు, సేంద్రియ ఎరువులు అవసరమని, అయితే అధికంగా యూరియా, క్రిమిసంహారక మందుల వినియోగం వల్ల భూసారంపై ప్రతికూల ప్రభావం పడుతోందని తెలిపారు.పెట్టుబడి ఖర్చులు తగ్గించుకునేందుకు రైతులు ప్రతి సంవత్సరం భూసార పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.ప్రాంతాలవారీగా అవసరమైన విత్తనాలు ముందుగానే సిద్ధం చేయాలని, ఆగ్రోస్ సంస్థ ద్వారా వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు సన్నకారు రైతులకు అద్దెకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ చర్యలు రైతు కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసి, అప్పుల భారంనుంచి బయటపడేందుకు దోహదపడతాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం
వనపర్తి,ఫిబ్రవరి4(తెలంగాణ ముచ్చట్లు): రానున్న మరో ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని, నిరుపేదలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వనపర్తి...
ఎస్సీ విద్యార్థుల ప్రీ మెట్రిక్ స్కాలర్‌ షిప్ నమోదు వేగవంతం చేయాలి
నితిన్ నబిన్ బహిరంగ సభకు బయలుదేరిన పెద్దమందడి బీజేపీ నాయకులు
వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేయాలి
మనిగిల్ల ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవాలపై చర్చ
ఎల్లంపేట్‌లో అక్రమ మద్యం స్వాధీనం
6వ వార్డులో బీజేపీ ప్రచార హోరు.