తోకల హృతిక్ రెడ్డి పార్థీవదేహానికి నివాళులు అర్పించిన నాయకులు 

తోకల హృతిక్ రెడ్డి పార్థీవదేహానికి నివాళులు అర్పించిన నాయకులు 

చిల్పూర్,జనవరి24(తెలంగాణ ముచ్చట్లు):

చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన బిజెపి జనగామ జిల్లా అధికార ప్రతినిధి తోకల సంపత్ రెడ్డి కుమారుడు తోకల హృతిక్ రెడ్డి గత నెల 30న జర్మనీలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. హృతిక్ రెడ్డి మృతదేహం ఈ రోజు ఉదయం స్వగ్రామానికి చేరుకోగా, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు నివాళులు అర్పించారు.

హన్మకొండ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, వన్నాల శ్రీరాములు, మహబూబాబాద్ మాజీ ఎంపీ అజ్మీరా సీతారామ్ నాయక్, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, బిజెపి మాజీ జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంతిమయాత్రలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జీ పెరుమాండ్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం మహేందర్, బిజెపి జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలోని అంజిరెడ్డి, చిల్పూర్ మండల పార్టీ అధ్యక్షుడు గంటె ఉపేందర్ యాదవ్, స్టేషన్ ఘనపూర్ మండల పార్టీ అధ్యక్షుడు సట్ల వెంకటరమణ గౌడ్, జఫర్గడ్డ్ మండల అధ్యక్షుడు కోరుకొప్పుల నగేష్ గౌడ్, ఎస్టీ మోర్చా రాష్ట్ర నాయకుడు గుగ్గులోత్ మధు, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ తౌటిరెడ్డిరాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. IMG-20260124-WA0018

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .