"తెలంగాణ ముచ్చట్లు"దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన  కలెక్టర్ బి.ఎం. సంతోష్ కుమార్

జోగులాంబ గద్వాల్,జనవరి24(తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ ముచ్చట్లు దినపత్రికకు సంబంధించిన క్యాలెండర్ ను జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ కుమార్ శనివారం ఆవిష్కరించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.....ప్రజలకు నిష్పక్షపాతమైన, విశ్వసనీయమైన సమాచారాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ పత్రిక ప్రజాస్వామ్యానికి బలంగా నిలుస్తుందని అన్నారు.

ప్రాంతీయ సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా ప్రయోజన అంశాలను బాధ్యతాయుతంగా ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో మీడియాకు కీలక పాత్ర ఉందని పేర్కొన్నారు. సమాజానికి మేలు చేసే వార్తలను ప్రచురిస్తూ పత్రిక తనదైన గుర్తింపును సంపాదించుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా తెలంగాణ ముచ్చట్లు పత్రిక యాజమాన్యానికి,రిపోర్టర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక రిపోర్టర్ తెలుగు మధు,తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .