సీఎం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట వరం

సీఎం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట వరం

నాచారం, ఫిబ్రవరి 05 (తెలంగాణ ముచ్చట్లు):

ప్రభుత్వం అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ పేదల జీవితాల్లో ఆశాజ్యోతిగా నిలుస్తోంది. నాచారం డివిజన్ వీఎస్‌టీ కాలనీకి చెందిన మహమ్మద్ షాహిన్ అనారోగ్య కారణాలతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్సకు భారీ ఖర్చులు కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉపశమనం లభించింది.ఈ విషయాన్ని ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.1 లక్ష 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయించారు.మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పేదలు, బాధిత కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .