యువతి అడ్వకేట్ స్వప్న హత్యపై బార్ అసోసియేషన్ల ఆగ్రహం

కుషాయిగూడలో ర్యాలీ – డీజీపీకి చర్యలు తీసుకోవాలని డిమాండ్

యువతి అడ్వకేట్ స్వప్న హత్యపై బార్ అసోసియేషన్ల ఆగ్రహం

కుషాయిగూడ, ఫిబ్రవరి 05 (తెలంగాణ ముచ్చట్లు):

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బార్ అసోసియేషన్‌కు చెందిన యువతి అడ్వకేట్ కుమారి స్వప్న దారుణ హత్యను తెలంగాణ రాష్ట్ర బార్ అసోసియేషన్ల సమాఖ్య తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో కుషాయిగూడలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.ఉదయం 11.00 గంటలకు కుషాయిగూడ కోర్టు నుంచి ఈసీఐఎల్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యనిర్వాహక కమిటీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ, ఈ కేసులో డీజీపీ స్థాయిలో జోక్యం చేసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ర్యాలీ అనంతరం కుషాయిగూడ ఏసిపికి వినతిపత్రం అందజేశారు. అలాగే ఈ ఘటనపై డీజీపీ దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ, కుషాయిగూడ సీఐ భాస్కర్ రెడ్డికి కూడా వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ల సమాఖ్య నాయకులు మాట్లాడుతూ, ఈ హత్య న్యాయవృత్తికి, న్యాయవ్యవస్థకు తీవ్ర మచ్చగా పేర్కొన్నారు. హత్యకు పాల్పడిన నిందితులందరినీ వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని, వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేసి ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.అడ్వకేట్ స్వప్న తన ప్రాణాలకు ముప్పు ఉందని గతంలో పలుమార్లు పోలీసులను ఆశ్రయించినప్పటికీ, ఆమె ఫిర్యాదులను సరైన రీతిలో పరిగణలోకి తీసుకోలేదనే అనుమానాలు ఉన్నాయని వారు తెలిపారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి, నిర్లక్ష్యానికి పాల్పడిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.సత్వర పోలీసు చర్యలు, వేగవంతమైన న్యాయ ప్రక్రియ ద్వారానే న్యాయవ్యవస్థపై న్యాయవాదులు మరియు ప్రజల విశ్వాసం నిలబడుతుందని బార్ అసోసియేషన్ల సమాఖ్య నాయకులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బార్ అసోసియేషన్ల సమాఖ్య అధ్యక్షులు ఎన్. అమరేందర్ రెడ్డి, కార్యదర్శి బాపిరెడ్డి, జాయింట్ సెక్రటరీ ధనలక్ష్మి, లైబ్రరీ సెక్రటరీ వెంకటేష్, ఖజానాదారు మురళి, లేడీ సెక్రటరీ రేణుక తదితరులు పాల్గొన్నారు.IMG-20260205-WA0131

Tags:

Post Your Comments

Comments

Latest News

అంతర్జాతీయ కరాటే పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులు అంతర్జాతీయ కరాటే పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులు
కుషాయిగూడ, ఫిబ్రవరి 05 (తెలంగాణ ముచ్చట్లు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో శుక్రవారం నిర్వహించిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో కుషాయిగూడ, చర్లపల్లి ప్రాంతాలకు చెందిన ఛాంపియన్ షాటోఖాన్ మార్షల్...
శక్తిసాయి నగర్ డివిజన్‌లో ఏఈ తో కలిసి విస్తృత బస్తీబాట కార్యక్రమం
యువతి అడ్వకేట్ స్వప్న హత్యపై బార్ అసోసియేషన్ల ఆగ్రహం
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో ప్రభుత్వ వైఫల్యం 
సీఎం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట వరం
మౌలిక వసతులే మా లక్ష్యం.!
రేషన్ దుకాణాల వద్ద పేదల బియ్యం దోపిడీ