పట్టా పాస్‌బుక్ లేని రైతులకు యూరియా అందాలి

పట్టా పాస్‌బుక్ లేని రైతులకు యూరియా అందాలి

–యూరియా యాప్ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు

–ఎల్కతుర్తి బీజేపీ మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్

ఎల్కతుర్తి. ఫిబ్రవరి 05 (తెలంగాణ ముచ్చట్లు):

పట్టా పాస్‌బుక్ లేకుండా వ్యవసాయం చేస్తున్న రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని ఎల్కతుర్తి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ తెలిపారు. ఇప్పటికే యూరియా కొరతతో ఇబ్బందిపడుతున్న రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న యూరియా యాప్ మరో భారంగా మారిందని విమర్శించారు.
గురువారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పట్టా పాస్‌బుక్ లేని రైతులను పరిగణనలోకి తీసుకోకుండా యూరియా పంపిణీలో నిబంధనలు విధించడం అన్యాయమని అన్నారు. యూరియా యాప్‌లో సాంకేతిక లోపాల వల్ల నమోదు ప్రక్రియ సజావుగా సాగక రైతులు సహకార కేంద్రాల చుట్టూ గంటల తరబడి తిరగాల్సి వస్తోందని తెలిపారు.
పట్టా ఉన్నా లేకపోయినా పంటలు పండించే ప్రతి రైతుకూ ఎలాంటి అడ్డంకులు లేకుండా సకాలంలో యూరియా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతుల వివరాలు నమోదు చేసి, పాస్‌బుక్ లేని రైతులకు కూడా యూరియా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.
పంట వేసే కీలక సమయంలో ఎరువులు అందకపోతే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని, ఇందుకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన హెచ్చరించారు. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .