అంతర్జాతీయ కరాటే పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులు

ద బెస్ట్ టీమ్’ ట్రోఫీని అందుకున్న కరాటే మాస్టర్ రవికుమార్ గౌడ్

అంతర్జాతీయ కరాటే పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులు

కుషాయిగూడ, ఫిబ్రవరి 05 (తెలంగాణ ముచ్చట్లు):

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో శుక్రవారం నిర్వహించిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో కుషాయిగూడ, చర్లపల్లి ప్రాంతాలకు చెందిన ఛాంపియన్ షాటోఖాన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాల వర్షం కురిపించారు.ఈ పోటీల్లో అకాడమీ విద్యార్థులు కట విభాగంలో నాలుగు బంగారు పతకాలు, రెండు వెండి పతకాలు, మూడు కాంస్య పతకాలు సాధించగా, కుమిటే విభాగంలో ఐదు వెండి పతకాలు, నాలుగు కాంస్య పతకాలు గెలుచుకున్నారు. ఈ విశేష విజయానికి గాను అకాడమీ ఫౌండర్, ప్రెసిడెంట్ కరాటే మాస్టర్ బుడిగే రవికుమార్ గౌడ్‌కు నిర్వాహకులు “ద బెస్ట్ టీమ్” ట్రోఫీని అందజేశారు.కట విభాగంలో శ్రీశాంత్ గౌడ్, విష్ణు, ప్రభావ్, మనస్విని బంగారు పతకాలు సాధించగా, రుద్ర, శ్రీహిత వెండి పతకాలు దక్కించుకున్నారు. అలాగే మనస్విని, శ్రీనిష్, ఉదయశ్రీ కాంస్య పతకాలు సాధించారు.కుమిటే విభాగంలో శ్రీశాంత్ గౌడ్, విష్ణు, శ్రీహిత, ఉదయశ్రీ, రుద్ర వెండి పతకాలు గెలుచుకోగా, శ్రీనిష్, ప్రభావ్, మనస్విని, మనవిశ్రీ కాంస్య పతకాలు సాధించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖపట్నం వెస్ట్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పి.జి.వి.ఆర్. నాయుడు, కరాటే ఆర్గనైజేషన్ సెక్రటరీ తాజద్దీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కరాటే మాస్టర్ రవికుమార్ గౌడ్‌ను శాలువాతో సత్కరించి మెమొంటో అందజేశారు. అలాగే విజేతలైన విద్యార్థులకు పతకాలు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .