అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన భావన దేవికి ఎమ్మెల్యే అభినందన

అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన భావన దేవికి ఎమ్మెల్యే అభినందన

ఏ ఎస్ రావు నగర్, ఫిబ్రవరి 05 (తెలంగాణ ముచ్చట్లు):

ఈ నెల 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇండోనేషియా దేశంలోని బాలీ నగరంలో జరగనున్న ఇండో–ఇండోనేషియా బాల్ బ్యాడ్మింటన్ సిరీస్‌కు భారత జట్టులో ఎంపికైన డా. ఏ ఎస్ రావు నగర్ డివిజన్‌కు చెందిన క్రీడాకారిణి దుగ్గిరాల భావన దేవిని ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, తన నియోజకవర్గానికి చెందిన క్రీడాకారిణి అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక కావడం ఎంతో సంతోషకరమని తెలిపారు. భావన దేవి భవిష్యత్తులో రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. త్వరలో జరిగే అంతర్జాతీయ క్రీడా పోటీల్లో భారత్‌కు బంగారు పతకం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.క్రీడలకు, క్రీడాకారులకు తన వంతు సహకారాన్ని ఎల్లవేళలా అందిస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. క్రీడాకారులు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే ప్రభుత్వ ప్రోత్సాహం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.ఈ అభినందన కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజ్గిరి బాల్ బ్యాడ్మింటన్ సంఘం జాయింట్ సెక్రటరీ సూర్యనారాయణ పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అంతర్జాతీయ కరాటే పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులు అంతర్జాతీయ కరాటే పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులు
కుషాయిగూడ, ఫిబ్రవరి 05 (తెలంగాణ ముచ్చట్లు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో శుక్రవారం నిర్వహించిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో కుషాయిగూడ, చర్లపల్లి ప్రాంతాలకు చెందిన ఛాంపియన్ షాటోఖాన్ మార్షల్...
శక్తిసాయి నగర్ డివిజన్‌లో ఏఈ తో కలిసి విస్తృత బస్తీబాట కార్యక్రమం
యువతి అడ్వకేట్ స్వప్న హత్యపై బార్ అసోసియేషన్ల ఆగ్రహం
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో ప్రభుత్వ వైఫల్యం 
సీఎం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట వరం
మౌలిక వసతులే మా లక్ష్యం.!
రేషన్ దుకాణాల వద్ద పేదల బియ్యం దోపిడీ