మౌలిక వసతులే మా లక్ష్యం.!

మౌలిక వసతులే మా లక్ష్యం.!

- 20 వార్డులో కమల్ పాషా.
- 22 వార్డులోఎండి. రెహనా కమల్ పాషా ముమ్మర ప్రచారం.

సత్తుపల్లి, ఫిబ్రవరి 5 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు కమల్ పాషా, ఎండి. రెహనా కమల్ పాషా ఇంటింటి ప్రచారంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ముఖ్యంగా 20, 22 వార్డుల్లో మౌలిక వసతుల కల్పననే ప్రధాన అజెండాగా తీసుకుని ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.
20వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కమల్ పాషా గురువారం వార్డులో విస్తృతంగా పర్యటించారు. సీసీ రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రైనేజీల ఏర్పాటు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు, ఇళ్లు, ఇళ్ల స్థలాల మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి తన వంతు బాధ్యతగా పనిచేస్తానని పేర్కొన్నారు. వార్డులో విద్యుత్ సమస్యలను గుర్తించి, తన సొంత ఖర్చులతో ఎలక్ట్రిక్ పోల్స్ ఏర్పాటు చేయించడం ద్వారా సేవాభావాన్ని చాటుకున్నారని స్థానికులు పేర్కొన్నారు.
22వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఎండి. రెహనా కమల్ పాషా మహిళలు, యువతతో కలిసి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. 22వ వార్డును అభివృద్ధిలో ముందంజలో నిలిపి, ఒక ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. వార్డు పరిస్థితులపై పూర్తి అవగాహన, స్థానిక కుటుంబ నేపథ్యం తనకు బలంగా మారుతుందని తెలిపారు. కోవిడ్ కష్టకాలంలో అనేకమందికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు, ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించి ప్రాణదాతగా నిలిచిన కమల్ పాషా సేవలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలవాల కరుణాకర్, రాయల కోటేశ్వరావు, జూపాటి పాపారావు, ప్రణతి వెంకటేశ్వరరావు, కొత్తపల్లి శివ, గజ్జల శీను, సంపత్, యూనిస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 11న జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో “హస్తం” గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని అందించాలని అభ్యర్థులు ప్రజలను కోరారు.IMG-20260205-WA0126

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .