ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.

మాల్ సిబ్బంది, యాజమాన్యానికి సీఐ తుమ్మలపల్లి శ్రీహరి సూచన.

ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.

సత్తుపల్లి, జనవరి 24 (తెలంగాణ ముచ్చట్లు):

రోడ్డు ప్రమాదాలను నివారించి, ప్రాణ నష్టాన్ని తగ్గించడమే లక్ష్యంగా సత్తుపల్లి పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సత్తుపల్లి పట్టణ సీఐ తుమ్మలపల్లి శ్రీహరి సత్తుపల్లి పట్టణంలోని జీవి షాపింగ్ మాల్‌లో నిర్వహించారు. మాల్‌లో పనిచేస్తున్న సిబ్బందికి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలను పాటించాలని సూచించారు. అలాగే మాల్ యాజమాన్యం తమ సిబ్బంది ట్రాఫిక్ నియమాలు పాటించేలా పర్యవేక్షించాలని సూచించారు.
ఇదే విధంగా సత్తుపల్లి పట్టణంలోని అన్ని వాణిజ్య, వ్యాపార సంస్థల యాజమాన్యాలు కూడా తమ వద్ద పనిచేసే సిబ్బంది రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని సీఐ కోరారు.
కళాశాలలు, పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఇంజినీరింగ్ కళాశాలలకు హాజరయ్యే విద్యార్థులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలు, ప్రమాద మరణాలు తగ్గించేందుకు పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.IMG-20260124-WA0027

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .