నేడు..కొత్తగూడెంలో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 6(తెలంగాణ ముచ్చట్లు)
పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి శనివారం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 10గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటన రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 10 గంటలకు 52వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. అనంతరం 60వ, 54వ, 53వ, 29వ, 30వ డివిజన్లలో మధ్యాహ్నం వరకు పర్యటన కొనసాగనుంది. తదుపరి 55వ, 59వ, 56వ డివిజన్లలో ప్రచారం చేపట్టనున్నారు. సాయంత్రం 57వ, 58వ, 49వ, 10వ, 11వ, 12వ డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం రాత్రి 7 గంటలకు 13వ డివిజన్‌లో, రాత్రి 8 గంటలకు 51వ డివిజన్‌లో కార్యక్రమాలు పూర్తిచేయనున్నారు.
ఆయా వార్డుల ప్రధాన కూడళ్లలో నిర్వహించే రోడ్‌షోల ద్వారా అభ్యర్థుల విజయానికి మద్దతుగా ఎంపీ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుంటూ అభివృద్ధి అంశాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
* ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో అభ్యర్థులతో పాటు వార్డు ఇన్ చార్జ్ లు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ బాధ్యులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఖమ్మంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది.


Comments