సత్తుపల్లి 14వ వార్డులో ప్రజల మనిషిగా కూసంపూడి మహేష్.

సత్తుపల్లి 14వ వార్డులో ప్రజల మనిషిగా కూసంపూడి మహేష్.

సత్తుపల్లి, ఫిబ్రవరి 6 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి మున్సిపల్ రాజకీయాల్లో ప్రజల మధ్య తిరుగుతూ సమస్యలను నేరుగా వింటూ పరిష్కారానికి కృషి చేసే నాయకులకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అలాంటి గుర్తింపును సంపాదించుకున్న నాయకుల్లో 14వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్న కూసంపూడి మహేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
గతంలో మున్సిపాలిటీ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం మహేష్‌కు పరిపాలనపై స్పష్టమైన అవగాహనను అందించిందని స్థానికులు చెబుతున్నారు. వార్డులోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులను వేగవంతం చేయడంలో ఆయనకు మంచి పట్టుందని పేర్కొంటున్నారు. వయస్సు, సామాజిక వర్గాల తేడా లేకుండా అందరితో స్నేహపూర్వకంగా మెలగడం మహేష్ ప్రత్యేకతగా చెప్పుకుంటున్నారు. డ్రైనేజీ, వీధిదీపాలు, తాగునీరు, రహదారి సమస్యలపై పలుమార్లు అధికారులను అప్రమత్తం చేసి పరిష్కారానికి కృషి చేసిన సందర్భాలు ఉన్నాయని వార్డు వాసులు గుర్తు చేస్తున్నారు. అందుకే ఆయనను “మనవాడు”గా భావిస్తున్నామని చెబుతున్నారు. హడావిడి ప్రచారానికి దూరంగా ఇంటింటికీ వెళ్లి పలకరించడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, యువతతో అభివృద్ధి అంశాలపై చర్చించడం మహేష్ ప్రచార శైలిగా కనిపిస్తోంది. రాజకీయ నాయకుడిలా కాకుండా కుటుంబ సభ్యుడిలా మెలగడం వల్ల ప్రజల్లో ఆయనకు ఆదరణ పెరుగుతోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
14వ వార్డులోని ప్రతి కాలనీ సమస్యలపై పూర్తి అవగాహనతో హామీలకే పరిమితం కాకుండా కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్న దృక్పథం తనలో ఉందని మహేష్ చెబుతున్నారు. వార్డు అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేస్తున్నారు. స్థానిక విశ్లేషణల ప్రకారం పరిపాలనా అనుభవం, అన్ని వర్గాలతో సన్నిహిత అనుబంధం, ఎప్పుడూ అందుబాటులో ఉండే స్వభావం, అభివృద్ధిపై స్పష్టమైన దృష్టి వంటి అంశాలు ఆయనకు అనుకూలంగా మారుతున్నాయని IMG-20260206-WA0126తెలుస్తోంది. “మన ఓటు – మన భవిష్యత్తు” అనే భావనతో 14వ వార్డు ప్రజలు అభివృద్ధి వైపు ఆలోచన పెంచుకుంటున్నారని స్థానికులు అంటున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .