జీహెచ్‌ఎంసీ కాంట్రాక్ట్ ఉద్యోగి అదృశ్యం

చర్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు

జీహెచ్‌ఎంసీ కాంట్రాక్ట్ ఉద్యోగి అదృశ్యం

చర్లపల్లి, ఫిబ్రవరి 06 (తెలంగాణ ముచ్చట్లు):

జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న యువకుడు అదృశ్యమైన ఘటన చర్లపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అలకుంట్ల చారి తెలిపిన వివరాల ప్రకారం, అతని సోదరుడు అలకుంట్ల విజయ్‌ (30) జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు.ఇటీవల భార్యతో జరిగిన కుటుంబ కలహం అనంతరం విజయ్‌ చర్లపల్లిలోని పూకట్‌నగర్‌లో తన సోదరుడి ఇంటికి వచ్చి రెండు రోజులపాటు అక్కడే ఉండి వెళ్లాడు. అనంతరం కొద్ది రోజులుగా విజయ్‌ ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.ఈ విషయమై అలకుంట్ల చారి చర్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి విజయ్‌ ఆచూకీ కోసం దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .