రాధిక చౌరస్తాలో చిన్నారుల ట్రాఫిక్ అవగాహన

గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో కార్యక్రమం

రాధిక చౌరస్తాలో చిన్నారుల ట్రాఫిక్ అవగాహన

కాప్రా, ఫిబ్రవరి 06 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని కాప్రా సర్కిల్ రాధిక చౌరస్తాలో గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో చిన్నారులతో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ లింగారెడ్డి, ఏఎస్ఐ నర్సింలు సహా ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిన్నారుల చేత ప్రజలకు ట్రాఫిక్ నియమాల ప్రాధాన్యతను వివరింపజేశారు. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్‌ను తప్పనిసరిగా పాటించాలి, రోడ్డు దాటేటప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి, వాహనదారులు హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించడంతో పాటు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని అవగాహన కల్పించారు.చిన్న వయసులోనే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్తులో బాధ్యతాయుత పౌరులుగా వారు ఎదుగుతారని ట్రాఫిక్ అధికారులు తెలిపారు. చిన్నారుల పాల్గొనడంతో నిర్వహించిన ఈ కార్యక్రమం రాధిక చౌరస్తాలో వచ్చిన ప్రజలను విశేషంగా ఆకట్టుకుని ప్రశంసలు అందుకుంది.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం.వి. శేషు కుమారి, పి.పి.టి ఇంచార్జ్ శ్వేతా రెడ్డి, ఉపాధ్యాయులు అశ్విని, రష్మీ, సహాన, ఉషా, కోమల్, జితేందర్, నరేష్, పీఈటీ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .