నగర పాలక సంస్థ విధులను పకడ్బందీగా నిర్వహించాలి.. 

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నగర పాలక సంస్థ విధులను పకడ్బందీగా నిర్వహించాలి.. 

ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి- 06(తెలంగాణ ముచ్చట్లు)

నగరపాలక సంస్థ సిబ్బంది తమ విధులను పకడ్బందీగా నిర్వహించాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు.
జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశం మందిరంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పని తీరుపై సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్యం మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ కారణంగా కొంత మేర మంచి ఫలితాలు వచ్చాయని, మరొకసారి ఖమ్మం కార్పోరేషన్ పరిధిలో ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణకు ప్రణాళిక తయారు చేయాలన్నారు. చెత్త రవాణా వాహనాలకు జిపిఎస్, ఫ్యూయల్ సెన్సార్ తప్పనిసరిగా ఉండాలని అన్నారు.  చెత్త వాహనాల మూవ్ మెంట్ రెగ్యులర్ గా మానిటరింగ్ చేయాలని కలెక్టర్ తెలిపారు. వాహనాలకు అవసరమైన మరమ్మత్తులు ఉంటే వెంటనే చేయించాలని, పారిశుధ్య కార్మికుల హాజరు నమోదులో ఎఫ్.ఆర్.ఎస్. విధానం అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.  ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ లో భాగంగా నగరంలో కనీసం 1000 ఓపెన్ ప్లాట్ లను గుర్తించి అక్కడ పిచ్చి మొక్కలు తొలగించాలని, చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు.  నగరంలో మీడియన్ లను రెగ్యులర్ గా క్లీన్ చేయాలని,  డస్ట్ ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. 
నగరంలో బ్రిడ్జి మీద ప్రచార హోర్డింగులు, పోస్టర్ లు అనుమతి లేకుండా పెట్టడానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేకుండా ఉన్న హోర్డింగులు, పోస్టర్లను తొలగించాలని, మరొకసారి అనుమతి లేకుండా పబ్లిక్ ప్రదేశాలలో పోస్టర్లు అతికిస్తే భారీ జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. నగరపాలక సంస్థలో నూతనంగా కొనుగోలు చేస్తున్న 4 వాహనాలు త్వరగా డెలీవరి వచ్చేలా చూడాలని అన్నారు. నగరంలో ప్రధాన రోడ్లలో డస్ట్ ఇబ్బంది లేకుండా, పేవ్ మెంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఖమ్మం నగరంలో మంజూరైన సిసి రోడ్ల, డ్రైయిన్ లను పూర్తి స్థాయిలో గ్రౌండ్ అయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.  సిసి రోడ్ల నిర్మాణం త్వరగా నాణ్యతతో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, పనుల పర్యవేక్షణకు డాష్ బోర్డు ఏర్పాటు చేయాలని, ఎఫ్.ఎస్.టీ.పి. మరమ్మత్తు పనులు చేపట్టాలని అన్నారు. 

అభివృద్ధి పనులలో ఎటువంటి నిర్లక్ష్యం చేయవద్దని, పనుల పురోగతిపై ప్రతివారం నివేదిక అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

మార్చి మొదటి వారం నాటికి ఫుట్ పాత్ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు.  నగరంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్ను వసూలు కేవలం 32 శాతం మాత్రమే ఉందని, నోటీస్ లు జారీ చేసినప్పటికీ ఆస్తి పన్ను చెల్లించకపోతే వెంటనే సంబంధిత భవనాలపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకొని సీజ్ చేయాలన్నారు.  నగరంలో డిఫాల్టర్ లను గుర్తించి వారికి వాటర్ సప్లై కట్ చేయాలని, ఇండ్లను, భవనాలను సీజ్ చేయాలని, ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఈ కార్యక్రమం అమలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.  వాణిజ్య సముదాయాల ఆస్తిపన్ను వసూలు కూడా 33 శాతం మాత్రమే ఉందని, పన్ను కట్టని వ్యాపారస్తుల ట్రేడ్ లైసెన్సులు వెంటనే రద్దుచేయాలని కలెక్టర్ ఆదేశించారు. మున్సిపాలిటీకి పన్ను కట్టడం ప్రతి పౌరుడి బాధ్యత అని, పన్నుల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆన్నారు. మీడియన్ మీద మొక్కలకు డ్రిప్ పైప్ లైన్ ద్వారా వాటర్ అందించాలని, పార్కులలో పచ్చదనం మెయింటైన్ చేసేందుకు వాటరింగ్ షెడ్యూల్ తయారు చేయాలని అన్నారు.  నగరంలో నూతనంగా వేస్తున్న ఫుట్ పాత్ ఆక్రమణకు గురి కాకుండా చూడాలని, ఫుట్ పాత్ లపై ఎటువంటి ర్యాంప్ నిర్మాణాలకు కూడా అనుమతించవద్దన్నారు. రోడ్డు విస్తరణ జరిగే చోట తప్పనిసరిగా పేవ్ మెంట్ ఏర్పాటు చేయాలని అన్నారు.  వాయు కాలుష్యానికి ముఖ్య కారణం రోడ్డు మీద ఉండే డస్ట్ కారణంగా ఉంటుందని, దీని నివారణకు మనవంతు చర్యలు తీసుకోవాలన్నారు. 
నగరంలో అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని అన్నారు.  నగరానికి త్రాగునీటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. అమృత్ 2.0 పథకం క్రింద చేపట్టిన త్రాగునీటి సరఫరా పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న మోటార్ లలో అవసరమైన మరమ్మత్తులు చేస్తే విద్యుత్ బిల్లులు తగ్గుతాయని, ఈ పనులను 3 వారాల్లో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. నగరంలో  ఎస్.టి.పి. ల నిర్మాణానికి అవసరమైన భూములు ఫిబ్రవరి 15 నాటికి అప్పగిస్తామన్నారు.   నగరంలో పెండింగ్ ఉన్న 1.6 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను అదనపు లేబర్ పెట్టి 4 వారాల్లో పూర్తి చేయాలన్నారు. పైలెట్ ప్రాజెక్ట్ క్రింద నగరంలో ఉన్న కుక్కలను నగరానికి దూరంగా షెల్టర్ ఏర్పాటు చేసి తరలించాలని అన్నారు. నగరంలో వీధి కుక్కలకు ఎవరు ఫీడ్ చేయడానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. కుక్కలకు అన్నం పెట్టడం వలన అలవాటుగా మారి, అన్నం దొరకని రోజు అవి దాడులకు పాల్పడుతున్నాయని, ఈ అంశం ప్రజలలో అవగాహన కల్పించాలని అన్నారు. నగరంలో ఎక్కడా డార్క్ ఏరియా ఉండకుండా లైటింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో ఖమ్మం మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, పబ్లిక్ హెల్త్ ఎస్ఇ రంజిత్, మునిసిపల్ ఇఇకృష్ణలాల్, సహాయ మునిసిపల్ కమీషనర్ అనిల్ కుమార్, మునిసిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, సంబంధిత  అధికారులు, తదితరులు పాల్గొన్నారు. IMG-20260206-WA0096

Tags:

Post Your Comments

Comments

Latest News

బ్యాలెట్ పేపర్స్ స్ట్రాంగ్ రూమ్‌ అర్ముడ్ గార్డు తనిఖీ చేసిన అడిషనల్ డిసిపి బ్యాలెట్ పేపర్స్ స్ట్రాంగ్ రూమ్‌ అర్ముడ్ గార్డు తనిఖీ చేసిన అడిషనల్ డిసిపి
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 6(తెలంగాణ ముచ్చట్లు) ఖమ్మం రూరల్ మండలం పెద్ద తండాలోని ప్రియదర్శిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని ఏర్పాటు చేసిన ఏదులాపురం మునిసిపాలిటీ...
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్ 
మున్సిపల్ ఎన్నికలు: ఫిబ్రవరి 11న స్థానిక సెలవు
నేడు..కొత్తగూడెంలో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
వడ్డెర సంఘం ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా గోగుల ఆది 
అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానం.. 
సత్తుపల్లి 14వ వార్డులో ప్రజల మనిషిగా కూసంపూడి మహేష్.