సాఫ్ట్‌వేర్ సిటీ లో హార్డ్ లైఫ్....!

సాఫ్ట్‌వేర్ సిటీ లో హార్డ్ లైఫ్....!

సాఫ్ట్‌వేర్ సిటీ లో హార్డ్ లైఫ్....!

హైదరాబాద్ ఆకాశాన్ని తాకుతున్న టవర్స్ కింద,
డిగ్రీ సర్టిఫికెట్లు తలదాచుకున్నాయి అద్దె గదుల్లో.
కంపెనీ గేట్ల ముందు నిలబడి
యువత కాలాన్ని క్యూ లో పెట్టి
భవిష్యత్తు కోసం టోకెన్ తీసుకుంటున్నారు.

కాఫీ కప్పుల్లో కరిగిపోతున్న కలలు,
PDF ఫైళ్లలో బంధించబడిన ప్రతిభ,
ఇంటర్వ్యూ రిజెక్ట్ మెసేజ్
రోజూ ఒక కొత్త రాజకీయ హత్య.

ఈ నగరం ఉద్యోగాలు ఇవ్వదు,
ఆశను అమ్ముతుంది ఈఎంఐల్లో.
నిరుద్యోగం ఇక్కడ శాపం కాదు,
సిస్టమ్ నేర్పిన శిక్ష.

మా తల్లుల ప్రార్థనలు సిగ్నల్ లైట్ దగ్గర ఆగిపోతే,
మా జీవితాలు మెట్రో టైమ్‌టేబుల్ లో ఇరుక్కుంటాయి.
హైదరాబాద్ లో నిరుద్యోగి అంటే
ఒక మనిషి కాదు… ఒక నడిచే రిజ్యూమే.


✍️బసడ సంపత్ యాదవ్

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .