మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం స్వాధీనం

అలియాబాద్‌లో ఫ్లైయింగ్ స్క్వాడ్ కట్టుదిట్టమైన చర్యలు

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం స్వాధీనం

మేడ్చల్–మల్కాజ్గిరి, ఫిబ్రవరి 06 (తెలంగాణ ముచ్చట్లు):

మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌ల సాధారణ ఎన్నికలు–2026ను పురస్కరించుకుని మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో అక్రమ మద్యం, నగదు పంపిణీ జరగకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాయి.ఈ తనిఖీలలో భాగంగా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్ గాడి మలక్ పేటలో ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహించింది. తనిఖీల సందర్భంగా ఏ. అరవింద్ రెడ్డి (తండ్రి: దామోదర్ రెడ్డి) నివాసంలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అక్రమంగా నిల్వ ఉంచిన 6.75 లీటర్ల మద్యంను గుర్తించారు.
ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం పోలీసు అధికారుల సహకారంతో అక్రమ మద్యం నిల్వలను వెంటనే సీజ్ చేసి, తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం జీనో వ్యాలీ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.ఎన్నికల సమయంలో ప్రజలను ప్రలోభపెట్టే చర్యలను సహించబోమని, అక్రమ మద్యం, నగదు, బహుమతుల పంపిణీపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అలాగే ప్రజలు ఎవరైనా ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .