సుందరకాండ పారాయణంలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
చర్లపల్లి, ఫిబ్రవరి 06 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ పరిధి లోని చర్లపల్లి గ్రామంలో శ్రీరామ భక్తితో ద్విదిన సుందరకాండ పారాయణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, సుందరకాండ పారాయణం ద్వారా మానసిక ప్రశాంతత లభించడంతో పాటు సమాజంలో సద్భావన పెరుగుతుందని తెలిపారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజలను ఒకే తాటిపైకి తీసుకువచ్చి ఐక్యతను బలపరుస్తాయని అన్నారు.కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీరామ నామస్మరణతో గ్రామాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపారు.
రెండు రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగియడంతో నిర్వాహకులు సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments