ఉప్పల్ హిల్స్‌లో రూ.50 లక్షల కమ్యూనిటీ హాల్ నిర్మాణం

పనులు పరిశీలించిన కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి

ఉప్పల్ హిల్స్‌లో రూ.50 లక్షల కమ్యూనిటీ హాల్ నిర్మాణం

ఉప్పల్, ఫిబ్రవరి 06 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ హిల్స్ ప్రాంతంలో రూ.50 లక్షల వ్యయంతో చేపడుతున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.శుక్రవారం ఉప్పల్ కార్పొరేటర్ మందముల రజిత పరమేశ్వర్ రెడ్డి కాలనీ వాసులతో కలిసి కమ్యూనిటీ హాల్ స్లాబ్ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కమ్యూనిటీ హాల్ పూర్తయితే స్థానికులకు వివాహాలు, సమావేశాలు, సామాజిక కార్యక్రమాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈ రాజ్ కుమార్, దుర్గం నవీన్ యాదవ్, గోవింద్ కుమార్ స్వామి, సల్ల ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పి. రామచందర్, టి. శ్రీనివాస్ రెడ్డి, జి. రమేష్, టి. విజయ్ సింగ్, గోవిందు, సుధాకర్ రెడ్డి, కె. రాములు, అక్కు రవి, మధు, అమృత్ రాజు, మహేష్ గౌడ్, శేఖర్ గౌడ్, పి. మహేందర్, సంజయ్, బి. అనిత, సత్యనారాయణ చారి, గొరిగే సత్తయ్య, మేడిశెట్టి క్లైమెట్, ఎస్. రామస్వామి, గోవింద్ కొమరయ్య, గోవింద్ నరసయ్య, పర్వతాలు యాదవ్, ఎన్. గిరి, గొర్రె సత్తయ్య, కె. బీరయ్య, జి. బీరయ్య, చందు తదితరులు పాల్గొన్నారు.IMG-20260206-WA0107

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .