స్మశాన వాటికను వైకుంఠధారణగా తీర్చిదిద్దుతున్నాం

కార్పొరేటర్ శాంతి సాయిజెన్

స్మశాన వాటికను వైకుంఠధారణగా తీర్చిదిద్దుతున్నాం

నాచారం, ఫిబ్రవరి 06 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ పరిధిలోని రెడ్డి సంఘానికి చెందిన రెడ్డి స్మశాన వాటికను వైకుంఠధారణగా అభివృద్ధి చేస్తున్నామని కార్పొరేటర్ శాంతి సాయిజెన్ తెలిపారు.రూ.58 లక్షల రూపాయల వ్యయంతో చేపడుతున్న స్మశాన వాటిక అభివృద్ధి పనులను కార్పొరేటర్ శాంతి సాయిజెన్ రెడ్డి సంఘం నాయకులు, సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.అలాగే, స్మశాన వాటికలో ఇంకా అవసరమైన మౌలిక సదుపాయాలు ఏవైనా ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని రెడ్డి సంఘం నాయకులను కోరారు. అవసరమైతే అదనపు నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డీఈ ఉమామహేశ్వరి, వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, రెడ్డి సంఘం అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ రెడ్డి, రమణారెడ్డి, శంకర్ రెడ్డి, మోహన్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .