తాలుక స్థాయి సీఎం కప్‌లో వెల్టూర్ బాలికల వాలీబాల్ జట్టు అగ్రస్థానం

తాలుక స్థాయి సీఎం కప్‌లో వెల్టూర్ బాలికల వాలీబాల్ జట్టు అగ్రస్థానం

పెద్దమందడి,ఫిబ్రవరి6(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా  గోపాల్‌పేటలో నిర్వహించిన తాలూకా స్థాయి సీఎం కప్ క్రీడల్లో జడ్పీహెచ్ఎస్ వెల్టూర్ పాఠశాలకు చెందిన బాలికల వాలీబాల్ జట్టు పెద్దమందడి మండలం తరఫున పాల్గొని అగ్రస్థానంలో నిలిచింది.వివిధ పాఠశాలల జట్లతో పోటీపడి అద్భుత ప్రతిభ కనబరిచి విజయం సాధించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాణం విష్ణు విద్యార్థినీలను అభినందించారు. అనంతరం జరగబోయే జిల్లా స్థాయి పోటీల్లో మరింత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు. క్రీడల ద్వారా విద్యార్థినీల్లో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని ఆయన తెలిపారు.ఈ విజయం పాఠశాలకు గర్వకారణమని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.IMG-20260206-WA0113

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .