అభయ ఆంజనేయ స్వామి వార్షికోత్సవంలో పాల్గొన్న రజిత పరమేశ్వర్ రెడ్డి

ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామి ఆశీస్సులు పొందిన ఉప్పల్ కార్పొరేటర్

అభయ ఆంజనేయ స్వామి వార్షికోత్సవంలో పాల్గొన్న రజిత పరమేశ్వర్ రెడ్డి

ఉప్పల్, ఫిబ్రవరి 06 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని సత్యానగర్ కాలనీలో గల శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం వార్షికోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఉప్పల్ కార్పొరేటర్ మందముల రజిత పరమేశ్వర్ రెడ్డి పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం, ఉప్పల్ ప్రజలపై స్వామివారి కృప, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. దేవాలయాల అభివృద్ధి, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు తమవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా కార్పొరేటర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అశోక్ గుప్తా, సుజాత, సల ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, లక్ష్మి, ధనలక్ష్మి, శ్వేత, సరవాణి పాల్గొన్నారు. అలాగే విజయ్‌కుమార్ కాలనీ అధ్యక్షుడు సతీష్ ముదిరాజ్, వైస్ ప్రెసిడెంట్ రాజు, సతీ, నరేష్, రాజీకాంత్, వెంకటేష్ ముదిరాజు, నరేష్ చారి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.IMG-20260206-WA0105

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .