మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు వికలాంగుల సంఘాల మద్దతు

వికలాంగుల సంఘం వనపర్తి పట్టణ అధ్యక్షుడు శ్రీశైలం 

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు వికలాంగుల సంఘాల మద్దతు

వనపర్తి,ఫిబ్రవరి6(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పరిధిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు జిల్లాలోని వికలాంగుల సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. జిల్లాలోని వికలాంగుల విజ్ఞప్తి మేరకు వనపర్తి ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని 1000 గజాల విస్తీర్ణంలో జిల్లా వికలాంగుల పునరావాస శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న సందర్భంగా వికలాంగుల సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.అదేవిధంగా జిల్లాలోని వికలాంగులకు అవసరమైన పరికరాలు అందించాలనే లక్ష్యంతో ప్రత్యేక శిబిరం నిర్వహించి 716  మందికి ఉపకరణాలు అందజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.జిల్లాలో వికలాంగుల సమస్యలను గుర్తించి, వారిని అభివృద్ధి మార్గంలో నడిపించేందుకు తీసుకుంటున్న చర్యలకు సంఘాల ప్రతినిధులు ప్రశంసలు వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పామిరెడ్డిపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు, వనపర్తి పట్టణ అధ్యక్షుడు శ్రీశైలం, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం అధ్యక్షుడు భాను కుమార్, ఉపాధ్యక్షుడు రమేష్, మధు, వివిధ వికలాంగుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .