30వార్డులో ప్రత్యర్థులకు శిరీ"షాక్"!

30వార్డులో ప్రత్యర్థులకు శిరీ

- *ఏదులాపురంలో ముగిసిన విపక్షాల కథ.. కాంగ్రెస్‌లోకి క్యూ*

- *మంత్రి పొంగులేటి సమక్షంలో ‘చేయి’ కలిపిన తప్పెట్ల గిడ్జన్ (మున్నా)*

- *బీఆర్ఎస్, సిపిఐ పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి 40 కుటుంబాలు*

- *శిరీషా రెడ్డి దూకుడుతో ప్రతిపక్షాలకు ముచ్చెమటలు*

ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 6(తెలంగాణ ముచ్చట్లు )

ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల కురుక్షేత్రంలో అప్పుడే ఫలితం తేలిపోయిందా? అంటే అవుననే అంటున్నాయి 30వ వార్డు రాజకీయ పరిణామాలు. కాంగ్రెస్ అభ్యర్థిని కొట్టం శిరీషా రెడ్డి ప్రత్యర్థులకు ఊహించని విధంగా "షాక్" ఇచ్చారు. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రతిపక్ష పార్టీలను ఖాళీ చేస్తూ, వార్డులో తన విజయకేతనాన్ని ఖాయం చేసుకుంటున్నారు.

*మంత్రి సమక్షంలో భారీ చేరికలు*
శుక్రవారం ఖమ్మంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం కీలక రాజకీయ మార్పుకు వేదికైంది. బీఆర్ఎస్ కీలక నేత తప్పెట్ల గిడ్జన్ (మున్నా) ఆధ్వర్యంలో బీఆర్ఎస్, సీపీఐ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు, సుమారు 40 కుటుంబాలు మంత్రి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాయి. స్వయంగా మంత్రి పొంగులేటి వారికి కండువాలు కప్పి ఆహ్వానించడంతో వార్డులో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

*గెలుపు ముంగిట శిరీషా రెడ్డి*
ఒకేసారి 40 కుటుంబాలు పార్టీలో చేరడంతో 30వ వార్డులో విపక్షాలు డీలా పడ్డాయి. అభ్యర్థిని శిరీషా రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుండటంతో ప్రత్యర్థులకు పాలుపోని పరిస్థితి నెలకొంది. "అభివృద్ధికి ఆకర్షితులయ్యే తాము కాంగ్రెస్‌లో చేరుతున్నామని, శిరీషా రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని" ఈ సందర్భంగా పార్టీలో చేరిన నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కొట్టం శిరీషా రెడ్డితో పాటు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .